సెప్టెంబర్, అక్టోబర్ లో ఉద్యమకారుల సంక్షేమం కోసం కార్యాచరణ
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి
ఎన్నికల కోడ్ కారణంగా పరిమితంగా చేసుకోవలసిన పరిస్తితి వచ్చింది.ఎటువంటి అతిక్రమణలకు పాల్పడకుండా జరుపుకుంటామన్నారు.. వేలాది మందితో నిర్వహించుకోవాలని భావించినా.. కొద్ది మందితో చేసుకోవాల్సిన పరిస్తితి ఉంది.ఉద్యమంలో పాల్గొన్న వారు అనేక మంది మాకు FIR కాఫీలు పంపారు.
జయభేరి, హైదరాబాద్, జూన్ 1 :
సెప్టెంబర్,అక్టోబర్ లో ఉద్యమకారుల సంక్షేమం కోసం కార్యాచరణ ప్రకటించ బోతున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి తెలిపారు.
జేఏసీ బయట ఉన్న అనేక సంఘాలు.. పాల్గొననున్నారు. హైదరాబాద్ వరకు రాలేని వారు.. జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో నిర్వహించే వేడుకలలో పాల్గొనాలని కోరారు.. పరేడ్ గ్రౌండ్స్ లో పెట్టగలిగే వీలున్నంత మంది ఉద్యమ… చాలా మంది ఉద్యమకారులకు ఆహ్వానం అందలేదు అనే ప్రచారం జరుగుతుంది.. అందరం కలసి నిర్వహించుకునే వేడుకలకు.. వైరుధ్యాలు, వ్యతిరేకత లు వద్దు. కేసిఆర్ మీరు తప్పక రండి.. సెప్టెంబర్, అక్టోబర్ లో ఉద్యమకారుల సంక్షేమం కోసం కార్యాచరణ ఉంటుంది. అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా గేయాన్ని జాతీయకి అంకితం చేయడమే ఎజెండా.. ఆహ్వానం విషయంలో ఏదైనా సమస్యలు ఉంటే కోదండరాం, యెన్నం శ్రీనివాసరెడ్డి, దయాకర్ దృష్టికి తీసుకువచ్చిన సహకరిస్తామన్నారు.


