విద్యుత్ షాక్ తో పేద రైతు ఎద్దు మృతి

విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యమే కారణం అంటున్న రైతు

ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెట్టిన విద్యుత్ శాఖ సిబ్బంది... ప్రాణ నష్టం జరిగిన తర్వాత స్పందిస్తారా అంటున్న రైతులు

విద్యుత్ షాక్ తో పేద రైతు ఎద్దు మృతి

జయభేరి : 

విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో షాక్ తగిలి ఎద్దు మృతి. హై పవర్ లైన్ వైరు ఎద్దుకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దాన్ని పట్టుకున్న రైతు కూడా షాక్ వచ్చినట్టు పేర్కొన్నారు. కొందుర్గ్ మండలం. తంగడపల్లి గ్రామానికి చెందిన. బెస్త చంద్రయ్య పొలం దగ్గర ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ శాఖ సిబ్బందిపై తక్షణ చర్యలు చేపట్టాలని రైతులు వాపోతున్నారు,

Read More Telangana I ఇది గౌడలను అవమానించడమే..!

అసలే పంటలు పండక నానా కష్టాలు పడి అప్పు సప్పు చేసి జీవనం కొనసాగిస్తుంటే ఒక సైడు ప్రకృతి విపత్తులు మరొక సైడు దోపిడీ దళారులు ఎంతో కొంత వచ్చిన సొమ్ముతో చావాలో బ్రతకాలో తెలియక నానా ఇబ్బందులు పడుతుంటే లక్షలకు లక్షల జీతాలు తీసుకుంటున్న అధికారులు మాత్రం మొద్దు నిద్రపోతున్నారని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా నిర్లక్ష్య వైఖరి వీడకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Read More Students I నైపుణ్య శిక్షణకు.. కేరాఫ్ తెలంగాణ....

Views: 2