కాంగ్రెస్‌ పార్టీలో చేరికల చిచ్చు

గుండ్లపోచంపల్లి మారుతున్న సమీకరణాలు..

కాంగ్రెస్ పార్టీలోకి వైస్ ఛైర్మన్..

రాజీనామా బాటలో మాజీ సర్పంచ్..

కాంగ్రెస్‌ పార్టీలో చేరికల చిచ్చు

జయభేరి, మేడ్చల్: 

చేరికలు కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు రేపుతున్నాయి. ఇప్పటికే కొత్త, పాత నేతల మధ్య సయోధ్య కుదర్చలేక ఇబ్బంది పడుతున్న ముఖ్యనేతలకు ఇప్పుడు కొత్త తలనొప్పులు వచ్చి పడింది. ఈ నేపథ్యంలో గుండ్లపోచంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ దామన్నాగారి ప్రభాకర్ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైస్ చైర్మన్ ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని కండ్లకోయ మాజీ సర్పంచి కందాడి నరేందర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. కండ్లకోయ గ్రామంలో కందాడి నరేందర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ప్రభాకర్ వర్గాలకు ఒకరంటే ఒకరికి పడదు. తను కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో వైస్ ఛైర్మన్ ప్రభాకర్ పార్టీలోకి వస్తే నేను కాంగ్రెస్ లోకి చేరబోనని మేడ్చల్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ నేతలకు స్పష్టంగా చెప్పానని కానీ ఇప్పుడు కొందరు నాయకులు తనకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులను కాంగ్రెస్ పార్టీలోకి తనకు సమాచారం లేకుండా చేర్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైస్ ఛైర్మన్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడాని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Read More శరన్నవరాత్రి మహోత్సవం

కాంగ్రెస్ పార్టీలోకి వైస్ ఛైర్మన్
లోక్ సభ ఎన్నికల వేళ మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి అయోమయంలో పడ్డాడు. మల్లారెడ్డి బిఆర్ఎస్ నాయకులకు, ప్రజా ప్రతినిధులను పట్టించు కోకుండా వ్యవహరిస్తున్నాడాని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో నియోజకవర్గంలోని బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు తమదారి తాము చూసుకుంటూ ఒక్కొక్కరుగా పార్టీని విడుతున్నారు. ఇప్పటికే మేడ్చల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ చిర్ల రమేష్ పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరగా తాజాగా శుక్రవారం గుండ్లపోచంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ దామన్నాగారి ప్రభాకర్ తన అనుచరులతో కలిసి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి ప్రభాకర్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్, మాజీ సర్పంచి భేరి ఈశ్వర్, నాయకులు గడిలా కృష్ణారెడ్డి, సుధాకర్, ఫిలిప్స్, శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Read More శ్రీ సాయి సన్నిధి వెంచర్ ను ప్రారంభించిన సినీ హీరో  శ్రీకాంత్ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

రాజీనామా బాటలో మాజీ సర్పంచ్
కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని భావించి బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన తమను అవమానించే విధంగా కొందరు నాయకులు చేస్తున్నారని కండ్లకోయ మాజీ సర్పంచ్ కందాడి నరేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ పార్టీలో తమకు సమాచారం లేకుండా బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులను కాంగ్రెస్ పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. గతంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన వ్యక్తి వల్లనే బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో వైస్ ఛైర్మన్ ప్రభాకర్ తో పని చేయలేనని స్పష్టం చేశారు. వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో చేరడాని నిరసిస్తూ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వారిలో మాజీ సర్పంచ్ కర్రోళ స్వామి, రవీందర్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ చిల్ల వెంకటేష్, కో ఆప్షన్ సభ్యులు గౌస్ ఖాన్, సీనియర్ నాయకులు రాజేందర్ ముదిరాజ్, రవీందర్ రెడ్డి, ఎర్రోళ శ్రీనివాస్, పెంటేష్, వీరేష్, సుదర్శన్, శ్రీనివాస్, కర్రోళ్ళ ప్రవీణ్,  యువనాయకులు శివ ముదిరాజ్, శ్రీకాంత్ ముదిరాజ్, ఎర్రోళ్ల సిద్ధు, దీపక్, శ్రీనివాస్ గౌడ్, సుదర్శన్, తలారి బాబు, అల్లి వేణు, భాస్కర్, పవన్ తదితరులు ఉన్నారు.

Read More అపూర్వం ఆత్మీయ సమ్మేళనం