వ్యవసాయ సహకార సంఘం 43 వ సాధారణ సమావేశం

  • సహకార సంఘం నుండి రైతుల నుంచి సభ్యత్వాలు నమోదు చేశాం
  • నష్టాల్లో ఉన్న సహకార సంఘాన్ని లాభాల్లో నడిపించాం - మధుకర్ రెడ్డి

వ్యవసాయ సహకార సంఘం 43 వ సాధారణ సమావేశం

జయభేరి, సెప్టెంబర్ 30 :
అన్నదాత ముఖాల్లో ఆనందం నింపడానికి  కృషి చేసినట్లు డిసిఎంఎస్ వైస్ చైర్మన్, శామీర్ పేట్ వ్యవసాయ సహాకార సంఘం చైర్మన్ డాక్టర్ రామిడి మధుకర్ రెడ్డి అన్నారు. సోమవారం శామీర్ పేట్ మండలంలో వ్యవసాయ సహాకార సంఘం 43వ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు శామీర్ పేట సోసైటిలో రైతుల నుంచి పెద్ద ఎత్తున సభ్యత్వాలను నమోదు చేశామని, నమోదైన  రైతుల సభ్యత్వ వాటా ధనం రూ.35.27 లక్షలకు చేరుకుందని అన్నారు. 

ఈ సంఘంలో వ్యవసాయ కూలీలు, చిన్నకారు, సన్నకారు, ఇతర రైతులు మొత్తం 9890 మంది ఉన్నారని చెప్పారు. ఇక హైదరాబాద్ జిల్లా కేంద్ర సహాకార బ్యాంకు, నాబార్డ్ నిధులతో 2 గోదాంలు, 1 అగ్రి ఔట్ లెట్ కార్యాలయం నిర్మాణానికి సుమారుగా రూ.1,80 లక్షలు రుణం ఇచ్చారని అన్నారు. అదేవిధంగా మూడుచింతలపల్లిలో నిర్మాణంలో ఉన్న అగ్రి ఔట్లెట్ నిర్మాణానికి గాను రూ. 94 లక్షలు మంజూరు చేశారన్నారు. అలాగే దీర్ఘకాలిక రుణాలకు రూ. 2 కోట్లు మంజురు చేసి స్వల్పకాల రుణపరిమితిని రూ.30 లక్షలకు బ్యాంకు వారు ఇటీవల మంజూరు చేశారన్నారు. 2023-24 చేపట్టిన పరపతేతర వ్యాపారాల్లో ఆడిట్ లెక్కల ప్రకారం రూ. 25,35 లక్షలకు పైగా లాభాలు చేకుర్చామని చెప్పారు. 

Read More గాంధీభవన్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి 

WhatsApp Image 2024-09-30 at 21.33.03

Read More ఇక హైదరాబాద్‌లో ‘డీజే’ చప్పుడు బంద్..!!

అలాగే సొసైటిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి జీవో 43 ప్రకారం వేతనాలు చెల్లిస్తున్నామని అన్నారు. రైతులకు అందుబాటులో కూరగాయల కలెక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భూసార పరీక్షలు ఎలా నిర్వహించాలి అనే అంశాలపై రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సోసైటి వైస్ చైర్మన్ ఐలయ్య, డైరక్టర్లు, రైతుబంధు సమితి మాజి అద్యక్షుడు కమఠం కృష్ణారెడ్డి, కోఆపరేటివ్ జాయింట్ రిజిస్ట్రార్ సురేఖ, డైరక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Read More నేనడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పండి..