పట్టభద్రుల ఉపఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
జయభేరి, దేవరకొండ :
వరంగల్ -ఖమ్మం -నల్గొండ ఉమ్మడి జిల్లాల శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని దేవరకొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి శ్రీరాములు అన్నారు.
ఎన్నికల సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి నిఘా పెట్టామని తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఎన్నికల నిబంధనల ప్రకారం చట్టరీత్యా శిక్షారులవుతారని వెల్లడించారు.

Read More Telangana 26th I భద్రతకు భరోసా ఏది!?
Views: 0


