ఆర్.వి ఫౌండేషన్,కమల హాస్పిటల్ సంయుక్తంగా"ఉచిత వైద్య శిబిరం"

పీర్జాదిగూడ 17వ డివిజన్లో " ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ

ఆర్.వి ఫౌండేషన్,కమల హాస్పిటల్ సంయుక్తంగా

సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ లో ఆర్ వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కమల హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల శ్రీనివాస్ రెడ్డి, కమల హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆశా అశోక్ కుమార్, ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ శిబిరంలో సుమారు 400 మందికి ఉచితంగా బిపి, ఈసీజీ, ఊపిరితిత్తుల పరీక్షలు నిర్వహించి మందులు అందించారు.

IMG-20240714-WA1759

Read More Health I ప్రజా ఆరోగ్యం మెరుగుపడేదెలా!?

ఈ సందర్భంగా పలువురు ముఖ్య అతిధులు మాట్లాడుతూ... ఆర్ వి ఫౌండేషన్ స్థాపించి ప్రతి ఏటా చలివేంద్రాలు, ఉచిత వైద్య శిబిరాలు, పేద విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ, రక్తదాన శిబిరాలు వంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న తుంగతుర్తి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. డాక్టర్ ఆశ అశోక్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ, బిపి, షుగర్, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి, ముఖ్యంగా మహిళలకు ఆరోగ్యం ఆహార అలవాట్లపై ప్రత్యేక అవగాహన శిబిరాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు డాక్టర్ ఆశ అశోక్ అన్నారు.

Read More Nagaaram Municipality I ఖల్ నాయక్.. కౌన్ ఆతా బై... అనే దేవ్ దే.. ఖేంగే...

IMG-20240714-WA1755

Read More Telangana I ఇది గౌడలను అవమానించడమే..!

ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ అశోక్ కుమార్, కమల హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కార్తీక్,కమల హాస్పిటల్ జనరల్ మేనేజర్ జోగు నవీన్ కుమార్,అసిస్టెంట్ మేనేజర్ తుంగ ఉపేందర్, పలువురు కాంగ్రెస్ నాయకులు, మారుతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణ, కాలనీవాసులు కైలాష్, బాబు,రాజు,ప్రసాద్ కేశవ్ తదితరులు పాల్గొన్నారు.

Read More Election I పార్టీల మేనిఫెస్టోల మతలబు ఏమిటి?

Views: 0