మతసామరస్యానికి ప్రతీక మొహరం

ఇరగదిండ్ల శ్రీశైలం

మతసామరస్యానికి ప్రతీక మొహరం

చందంపేట :
చందంపేట మతసామరస్యానికి ప్రతీకగా  మొహరం పీర్ల పండుగని, కుల మతాలకతీతంగా ఈ పండుగను నిర్వహించడం మన సాంప్రదాయమని  చందంపేట మండలానికి చెందిన ఇరగ దిండ్ల  శ్రీశైలం అన్నారు.

చందంపేట మండలంలో కేంద్రంలో అంగరంగ వైభవంగా సాగే పీర్ల పండుగకు గత ఐదు సంవత్సరముల నుండి ఫకీర్ వేషధారణ వేస్తూ చందంపేట ప్రజలు ఆకర్షితులవుతున్నారు. మొహరం పండుగ సందర్భంగా ఈ ఫకీర్ వేషాదరణ వేయడం తమ అదృష్టంగా భావిస్తున్నానని, ఈ కార్యక్రమాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా ఇరగ దిండ్ల శ్రీశైలం మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో పేర్లను ప్రతిష్టిస్తారని, హిందూ ముస్లిం భాయి భాయి  సంకల్పంతో జరుపుకునే పండుగ మొహరం అని అన్నారు.

Read More telangana I రాజ్యాంగ స్పూర్తికి తిలోధకాలు...!?

WhatsApp Image 2024-07-16 at 6.58.36 PM

Read More Medigadda I మేడిగడ్డ.. బొందల గడ్డ... భాష మార్చుకోకపోతే ప్రజలు చీదరిస్తారు!

ముస్లిం సోదరులతో పాటు హిందూ సోదరులు కూడా ఈ పండుగను జరుపుకోవడం  ఆనవాయితీగా వస్తుందని అన్నారు. చందంపేట గ్రామంలో ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటామని, ఈ మొహరం పండుగ కోసం బతుకుతెరువు కోసం వలస వెళ్లిన ప్రజలు స్వగ్రామాలకు వస్తారని అన్నారు. మొహరం పండుగ రోజు మొక్కుకున్నావారు కోరికలు తీరిన వాళ్లు పీర్లకు వెండి బంగారం గొడుగులు ఉయ్యాలలు దట్టీలు సమర్పించుకుంటారని పీర్ల ను పట్టుకునే వారి శరీరంలో దేవుడు ప్రవేశిస్తాడని వారు చెప్పే మాటలు నిజమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరగ దిండ్ల శ్రీశైలం ఫకీర్, జబ్బు శ్రీశైలం, ఓర్సు యుగంధర్, పగిడిమర్రి రవీందర్, మాతంగి దేవేందర్, సారంగి వెంకటేష్, ఎండి మజ్జు,  గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Read More Telangan I ఏదీ రాజ్యాంగ స్ఫూర్తి.. సందేహమా? సవాళ్ల?

Views: 0