జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో విఙ్ఞాన భారతి పాఠశాల విద్యార్థుల ప్రతిభ

2 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్ సాధించిన విద్యార్థులు.. విద్యార్ధులను అభినందించిన పాఠశాల యాజమాన్యం

జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో విఙ్ఞాన భారతి పాఠశాల విద్యార్థుల ప్రతిభ

జయభేరి, డిసెంబర్ 4:
గత నెల 28 నుండి డిసెంబర్ 1 వరకు పూణే లో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో తూoకుంటలోని శ్రీ విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరిచారు. పాఠశాలలో 6 వ తరగతి చదువుతున్న టి. సంతోష్ గౌడ్ పోటీలో పాల్గొని రెండు గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ మెడల్ సాధించగా,  4 వ తరగతి చదువుతున్న కే దీపక్ కుమార్ సిల్వర్ మెడల్ ను సాధించారు. 

ఇద్దరు విద్యార్థులను బుధవారం పాఠశాల యాజమాన్యం మెమెంటో, ప్రశంసా పత్రాలను అందించి అభినందించారు. తమ పాఠశాల నుండి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పథకాలు సాధించడం తమ కెంతో గర్వంగా ఉందని పాఠశాల కరస్పాండెంట్ , ట్రస్మా మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు గోనె హన్మంతురెడ్డి , ప్రిన్సిపల్ బెంబడి జంగారెడ్డి లు అన్నారు. విద్యార్థులు మరిన్ని పథకాలు సాధించాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు గోనె సంగీత, కరాటే మాస్టర్ సత్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

gold2

Read More ఎంజెపి లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

Latest News