Elections : ప్రశాంతంగా ముగిసిన మొదటి దశ పోలింగ్
- మణిపూర్‌లో పలు పోలింగ్‌బూత్‌లపై దుండగులు దాడి చేశారు. ఫలితంగా 5 చోట్ల కాసేపు ఓటింగ్‌కి అంతరాయం కలిగింది. ఇక అసోంలోనూ అనూహ్య ఘటన జరిగింది. EVMలను తీసుకెళ్తున్న కార్ నదిలో మునిగిపోయింది. ఉన్నట్టుండి నదీలో నీటి మట్టం పెరగడం వల్ల ఒక్కసారిగా SUV వాహనం మునిగిపోయింది.
జయభేరి, న్యూఢిల్లీ, ఏప్రిల్ 19
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. 3 గంటల సమయానికి అన్ని రాష్ట్రాల్లో కలిపి 74.5% పోలింగ్ శాతం నమోదైంది. కొన్ని చోట్ల పోలింగ్ నెమ్మదిగా జరుగుతోంది.
అండమాన్, నికోబార్ దీవులు - 78.64%
అరుణాచల్ ప్రదేశ్ - 74.95%
అస్సాం - 81.15%
బీహార్ - 79.23%
చత్తీస్ గఢ్ - 82.02%
జమ్మూ కాశ్మీర్ - 70.43%
లక్షద్వీప్ - 65.59%
మధ్యప్రదేశ్ - 77.12%
మహారాష్ట్ర - 76.98%
మణిపూర్ - 79.63%
మేఘాలయ - 82.96
మిజోరాం - 82.96%
త్రిపుర - 73.62%
ఉత్తర ప్రదేశ్ - 72.22%
ఉత్తరాఖండ్ - 80.41%
పశ్చిమ బెంగాల్ - 75.09%
సాంకేతిక సమస్యలు
2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ బీహార్‌లో జరిగింది. బీహార్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు తొలి దశలో ఓటింగ్ పూర్తైంది. అయితే ఓటింగ్ సందర్భంగా షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. నిజానికి ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఔరంగాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నెహుటా గ్రామంలో ఓటింగ్‌ను బహిష్కరించారు ప్రజలు. ఓటు వేయకపోవడానికి గల కారణాలను కూడా చెప్పారు. గ్రామంలో ఏర్పాటు చేసిన బూత్‌లో ఉదయం ఏడు గంటల నుంచి కేవలం మూడు ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ గ్రామం గురించి తెలుసుకొని ఓటు వేయకపోవడానికి గల కారణాలను కూడా తెలుసుకుందాం.
గ్రామంలోని బూత్ నంబర్ 97లో ఉదయం ఏడు గంటల వరకు కేవలం మూడు ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక్కడ మొత్తం ఓటర్లను పరిశీలిస్తే 944 మంది ఓటర్లు ఉండగా, అందులో 524 మంది పురుషులు, 420 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఓటు వేసేందుకు ప్రజలు బూత్‌కు రాకపోవడంపై పోలింగ్ అధికారులతో మాట్లాడగా.. ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం అందించామని చెప్పారు.
ఓటింగ్ వేసిన ప్రముఖులు
దేశంలో తొలి విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. తొలి విడతలో 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పలువురు నేతలు ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం స్టాలిన్, తమిళనాడు సౌత్‌లో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, సేలంలో పళనిస్వామి, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి చిదంబరం శివగంగ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. మాజీ ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో పాటు పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఓటు వేశారు. రజినీకాంత్, కుష్బూ, కార్తీక్, అజిత్, శివకార్తీకేయన్ ఉదయాన్నే వచ్చి తమ ఓటు వేశారు. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఓ గంట ముందుగానే పోలింగ్ ముగియనున్నట్లు తెలిపారు ఎన్నికల అధికారులు. గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు చాలా తేడాలు ఉన్నాయి. ప్రస్తుతం తమిళనాడులో త్రిముఖపోరు నెలకొంది. డీఎంకే, ఏడీఎంకే, బీజేపీ కూటముల మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతోంది. రాజస్తాన్‌లోనూ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు ఎన్నికల అధికారులు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు క్యూ లైన్లలో నిల్చున్నారు. రాజస్తాన్ సీఎం భజనలాల్ శర్మ తనకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మధ్యప్రదేశ్‌లో కూడా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ పర్వం కొనసాగుతోంది. మాజీ సీఎం కమల్‌నాథ్ ఓటు హక్కు వినియోగించుకోగా ఆయన కుమారుడు, కాంగ్రెస్ నేత నకుల్ నాథ్ చింద్వారా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. చింద్వారాలో పోలింగ్ కొనసాగుతోంది. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఉదయాన్నే వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు ఓటర్లు. దీంతో మధ్యాహ్నం సమయానికే మంచి పోలింగ్ శాతం నెలకొనే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు
Post Comment