Notification I లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు నేడు నోటిఫికేషన్‌ వెలువడింది

తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Notification I లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు నేడు నోటిఫికేషన్‌ వెలువడింది

జయభేరి, న్యూఢిల్లీ:

లోక్‌సభ తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్‌ బుధవారం విడుదల కానుంది. తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నేడు నోటిఫికేషన్‌ వెలువడడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 27 చివరి తేదీ. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Read More 24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలు

ఏడు దశల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బుధవారం తొలి దశ పోలింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. EC నోటిఫికేషన్ జారీ చేయడంతో, మొదటి దశలో, 21 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. తమిళనాడులోని 39 నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Read More మానవత్వం చాటిన కోబ్రా 205 జవానులు

తమిళనాడులో 39, రాజస్థాన్‌లో 12, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 50, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, మణిపూర్, అరుణాచల్ రాష్ట్రాల్లో 200 సీట్లు ప్రదేశ్, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి.

Read More వయనాడ్ విలయం

Social Links

Related Posts

Post Comment