Elections 2024 I అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో అరుణాచల్-సిక్కిం కీలక మార్పు.. ఫలితాల ఎప్పుడంటే?
జూన్ 4న లోక్‌సభతో పాటు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నట్లు ఈసీ శనివారం ప్రకటించింది.
జయభేరి, హైదరాబాద్:
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో ఎన్నికల సంఘం మార్పులు చేసింది. జూన్ 4న లోక్‌సభతో పాటు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నట్లు ఈసీ శనివారం ప్రకటించింది. అయితే, ఈ అసెంబ్లీల గడువు జూన్ 2తో ముగియనుంది.
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో ఎన్నికల సంఘం మార్పులు చేసింది. జూన్ 4న లోక్‌సభతో పాటు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నట్లు ఈసీ శనివారం ప్రకటించింది. అయితే ఈ అసెంబ్లీల గడువు జూన్ 2తో ముగియనుందని.. జూన్ 4న కాకుండా.. జూన్ 2న ఈ రాష్ట్రాల్లో కౌంటింగ్ నిర్వహించి మొత్తం ప్రక్రియను పూర్తి చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే సిక్కిం, అరుణాచల్ రాష్ట్రాల్లోని పార్లమెంట్ స్థానాల ఓట్ల లెక్కింపులో ఎలాంటి మార్పులు లేవని ఈసీ వెల్లడించింది.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు లోక్‌సభ స్థానాలు, 60 మంది సభ్యుల అసెంబ్లీ ఉంది. రాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం జూన్ 2తో ముగియనుంది. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అసెంబ్లీలో బీజేపీ 41 సీట్లు, జనతాదళ్ (యునైటెడ్) 7 సీట్లు, ఎన్పీపీ 5 సీట్లు, కాంగ్రెస్ 4 సీట్లు గెలుచుకున్నాయి. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు, పీపీఏ ఒక స్థానంలో కూడా విజయం సాధించారు. బీజేపీ, సిక్కిం క్రాంతికారీ మోర్చాతో కూడిన ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. మహిళా సంక్షేమ పథకాలే ప్రధాన ప్రచారాంశాలు.
ఏప్రిల్ 19న సిక్కింలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఈ హిమాలయ రాష్ట్రంలో కేవలం ఒక లోక్‌సభ స్థానం మరియు 32 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. మార్చి 20న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఆ తర్వాత నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఈసీ తెలిపింది. నామినేషన్ పత్రాల దాఖలుకు చివరి తేదీ మార్చి 27, నామినేషన్ పత్రాల పరిశీలన మార్చి 28న జరుగుతుందని.. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 30 చివరి తేదీ అని కమిషన్ తెలిపింది. ఈ ఎన్నికల్లో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (SDF)కి వ్యతిరేకంగా పోటీ పడింది.
లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. అసెంబ్లీ గడువు కంటే ముందే ఎన్నికల నిర్వహణ పూర్తి కావాల్సి ఉన్నందున అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఎన్నికల షెడ్యూల్‌లో ఈసీ మార్పులు చేసింది. చైనా సరిహద్దులో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికలు జరగనున్నాయి.
Post Comment