Dr. BR Ambedkar : విశ్వ విజేత.. భారత భాగ్య విధాత... పాదాభివందనం...

నేడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ‘జయభేరి’ న్యూస్ ప్రేక్షకులందరికీ కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ శీర్షిక

Dr. BR Ambedkar : విశ్వ విజేత.. భారత భాగ్య విధాత...  పాదాభివందనం...

ఆర్థిక వ్యవస్థ.. పరిపాలన వ్యవస్థ.. రాజకీయ వ్యవస్థ.. న్యాయ వ్యవస్థ.. ప్రజాస్వామ్య వ్యవస్థ.. ప్రజా హక్కులు ఇలా చెప్పుకుంటూ పోతే వ్యవస్థను పటిష్టం చేసి స్వేచ్ఛ ఒక్కటే చాలదు సమానత్వం కావాలని చెప్పిన వైతాళికుడు, ప్రపంచ మేధావి మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్... ఆయన గురించి ‘జయభేరి’లో ఓ ఆర్టికల్ రాయడం ఇది నా అదృష్టంగా భావిస్తూ.. ‘జయభేరి’ పత్రిక చీఫ్ ఎడిటర్ మోతె రఘు తిరుపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను....

జయభేరి, హైదరాబాద్ :
ప్రపంచంలో ఆరు ఖండాల్లో ని 5 ఖండాల్లో అంబేద్కర్ విగ్రహం ప్రతి చోట ఉంటుంది. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఆఫ్రికా ఖండం ఆసియా ఖండం ఇలా ప్రతి దేశంలోనూ అంబేద్కర్ పాద ముద్రలను గౌరవిస్తూ ఆయన బొమ్మను పట్టుకొని హక్కుల కోసం పోరాడుతుంది.

Read More సైబర్ నేరాలకు రోజుకు 14 కోట్లు మాయం..?

నేటికి 100 సంవత్సరాలు దాటి అమెరికాను వదిలేసిన ఆయన జ్ఞాపకాలు ఇంకా నేటి అమెరికా దేశంలో ఆయన ఫోటో పట్టుకొని ఆయన నడిచిన అడుగులను గుర్తుపెట్టుకుని అంబేద్కర్ బొమ్మతో హక్కుల సాధన కోసం పోరాడుతున్న సంఘాలు అమెరికాలో రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. వందల ఏళ్లు గడుస్తున్నా అందరి మహానుభావుల కంటే అంబేద్కర్ మహానుభావుడి చరిత్ర రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఆయన ఒక సామాన్య వ్యక్తి అని అనుకుంటే పొరపాటే... అలా అని ఆయన ఒక తత్వవేత్త ఆయన ఒక పోరాట యోధుడు ఆయన ఒక విప్లవకారుడు అని అనేక విధాలుగా ఆయనను అభివర్ణించుకోవచ్చు.

Read More 800 కేజీల తృణధాన్యాలతో 12 గంటలు శ్రమించి పీఎం మోదీ చిత్రాన్ని గీసిన 13 ఏళ్ల బాలిక

Ambedkar_Jayanti

Read More వయనాడ్ విలయం

వెలివాడల జీవితాల్లో వెలుగులో విరజింబించిన అంబా వాడేకర్ ఆయనే భీమ్రావు రాంజీ అంబేద్కర్.. లండన్ లో చదువుకునేటప్పుడు ఆయన అమెరికాను వదిలేసి లండన్ వెళ్లిన తర్వాత ఆయన చేసిన ప్రసంగాలు నేటికీ ఆయా దేశాల్లో చట్టాలుగా చలామణి అవుతున్నాయి. ప్రపంచ దేశాలన్నింటిలోనూ సగం దేశాలు ఆయన రచనలను ఆదర్శంగా తీసుకొని దేశాలను పరిపాలిస్తున్నారు. బుద్ధుని తర్వాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వ గురువుగా భారతదేశం ఏనాడో అభివర్ణించుకుంది. కానీ నేటి సభ్య సమాజంలో విశ్వగురు అంటే కులానికి మతానికి అంటుకట్టి ఒక వర్గం వైపే అంబేద్కర్ అన్నట్టుగా చూపించే ఈ సమాజంలో అంబేద్కర్ మరిచి పోతుందేమో అని అనుకున్నారు కానీ అంతకు రెట్టింపుగా ఆయన విగ్రహాలు వందల అడుగుల్లో నిలువెత్తు సాక్షీ రూపాలుగా ఆయన విగ్రహాలు వెలుస్తున్నాయి.

Read More చుక్కలు చూపిస్తున్న టమాటా...

ఆధిపత్య కులాల పరిపాలనలో ప్రజాస్వామ్యం మొనగాడు కొనసాగదని ఆయన భారత దేశంలో ఒక రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగపు నీడలో ప్రజాస్వామ్యాన్ని ఆవిష్కరించిన వైతాళికుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు.. ఒక స్వేచ్ఛ ఉంటే సరిపోదు, అది సమానత్వం కూడా క్రోడీకరించుకొని ఉంటేనే స్వేచ్ఛకు అర్థం ఉంటుంది అని వందల ఏండ్ల క్రితమే ఆయన భవిష్యత్తును ఆలోచించుకొని ఎన్నో ఆర్టికల్స్ను రాశారు. నిజానికి భారతదేశంలో ఆధిపత్య కులాలు ఆధిపత్యపు వర్గం అధికారం చలాయిస్తుంటే రక్తరహిత ప్రజాస్వామ్యంగా ఆయన పోరాటం కొనసాగించి భారతదేశాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్యంగా నేడు ప్రపంచ దేశాల ముందు నిలబెట్టాడు.

Read More ఏఐతో ఉద్యోగాలపై ప్రభావం...

1916లో కొలంబియాలు ఆయన చదువుకుంటున్నప్పుడు కాస్టింగ్ ఇండియా అంటే యంత్రాంగం దాని పుట్టుక దాని ప్రభావం అనే విషయంపై ఆయన ఒక 16 పేజీల ఆర్టికల్ని రాసి పెట్టారు. ఎందుకంటే ఒక స్వేచ్ఛ ఉంటే సరిపోదు ఆ స్వేచ్ఛ పరిపూర్ణంగా ప్రజలందరూ అనుభవించాలి అని అంటే సమానత్వం కచ్చితంగా ఉండాలి అని ఆయన ఆనాడే వైతాళికుడిగా ఆలోచించి ప్రాథమిక హక్కులలో పొందుపరిచాడు. నిజానికి భారతదేశంలో కుల రక్కసి మహమ్మారి రెక్కలు విప్పుకొని కూరలు చాచి విషయాన్ని కక్కుతుందని ఆనాడే ఆయన గుర్తిరిగి ఒక మాట అమెరికా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు నేటికీ సజీవంగా ఉంటున్నాయి... భారతదేశంలోని ప్రజలు అమెరికాలో స్థిరపడితే అమెరికాను కూడా వదలకుండా కుల రక్కసితో అమెరికా అతలాకుతలం అవుతుంది అని చెప్పిన మాట నేటికీ సజీవంగా కనిపిస్తోంది. అందుకే వందల ఏండ్లు గడిచినా అమెరికా లాంటి అగ్రదేశాలు అంబేద్కర్ నడిచిన పాదముద్రల కోసం వెతికి ఆయన పాదముద్రలను పూజిస్తూ గౌరవిస్తూ ఆయన బొమ్మలను పట్టుకొని హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారు..

Read More 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు..

images

Read More ఆశల పల్లకీలో కొత్త బడ్జెట్...

నిజానికి జై భీమ్ అనే మాట నేడు జైశ్రీరామ్ కంటే వందల రెట్లు భారతదేశంలో మారుమోగుతుంది. అధికారం కోసం ఆధిపత్య కులాలన్నీ కలిసి దేవుని రాజకీయంలోకి లాగుతున్న నేటి నవీన నాటకీయ రాజకీయంలో జై శ్రీ రామ్ అనేది ఒక రాజకీయ నినాదంగా మారిపోతుంది. 
ఈ సమయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహానుభావుడు చెప్పిన మాట ఒకటి జ్ఞాపకం వస్తుంది. ప్రజాస్వామ్యం మనుగడ కులాలకు మతాలకు ప్రాంతాలకు సంబంధం లేకుండా ఉంటే అది ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగుతుంది అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. కానీ నేడు జరుగుతున్నది ఏమిటి కులాలతో మతాలతో ప్రాంతాలతో రాజకీయాన్ని ముడిపెట్టి నా కులం వాడు నా మతం వాడు నా ప్రాంతం వాడు అనే స్వార్ధ భావాలతో రాజకీయంలో అధికారం కోసం అడ్డదారులు తొక్కి రాజకీయాల్లో అధికారాన్ని దక్కించుకుంటున్నారు.

Read More భారత్‌ అభివృద్ధి వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది

ఇదేనా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశించిన ప్రజాస్వామ్యం. ఇదేనా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశించిన అసమానతులను తొలగించాలని కోరుకున్న సమానత్వం... ఆయన జీవితం ప్రపంచానికి ఆదర్శం. ఆయన సాహసం ఈ యువతరానికి ఓ మార్గదర్శనం... ఆయన నడిచిన దారి ఆయన చదివిన పుస్తకం ఆయన రాసిన ప్రతి అక్షరం నేటి సమాజానికి ఒ కనువిప్పు అవుతుంది..

Read More బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత

బుద్ధున్ని కూడా వదలకుండా తన మతంలో కలిపేసుకున్న హిందూ మతాన్ని ఆయన ఈనాడు మన ధర్మ శాస్త్రాన్ని చెత్త పేపర్ల భావించి ఆయన మనుధర్మ శాస్త్రాన్ని పూర్తిగా ఖండించాడు... డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఈ సభలో మాట్లాడిన ఏ వేదికపై మాట్లాడిన ఆయన మాటల్లో కులం రక్కసిని మహమ్మారిని కూకటి వేళ్లతో తరిమి వెయ్యాలని మాటలే మనకు స్పష్టంగా కనిపిస్తాయి. వందలు కాదు వేళ ఎండ్లైనా సరే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మనలో సజీవంగానే ఉంటారు...

Read More వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు

ఆయన జన్మ.....
భారతదేశ రాజ్యాంగాన్ని అందించడానికి ఈ నేల తల్లి పురుడుపోసుకుందేమో... ఆయన పడ్డ కష్టం ఆయన పొందిన బాధ నేను వర్ణించాలంటే నా కళ్ళల్లో నీళ్లు చెమ్మగిల్లుతున్నాయి... నవీన నాగరికత సమాజంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి తెలియని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఈ జయంతి రోజైనా కనీసం ఆయన గురించి చదవండి... చదివింది ఓ నలుగురికి బోధించండి. అలా బోధిస్తూ నలుగురిని చైతన్య పరచండి. అదే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహాశివుడు కోరుకున్న ప్రజాస్వామ్యం... బహుజన సమాజ హితాన్ని కోరుతూ ఆయన చేసిన ప్రతి పోరాటం. విప్లవకారుడిగా వైతాళికుడిగా ఆర్థిక నిపుణుడిగా పరిపాలన వ్యవస్థను పటిష్టం చేసి రాజకీయ వ్యవస్థకు పునాదులు పోసి ప్రజాస్వామ్యాన్ని నిర్మించి ప్రజా హక్కులను పొందుపరిచి న్యాయవ్యవస్థకు ప్రాణం పోసిన నేటి మార్గదర్శి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్...

నేడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ‘జయభేరి’ న్యూస్ ప్రేక్షకులందరికీ కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ శీర్షిక ద్వారా ఆయన గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని మీతో పంచుకున్న... తప్పులుంటే మన్నిస్తూ తెలియకుంటే తెలుసుకొని అంబేద్కర్ గురించి మరింతగా చదివి తెలుసుకొని ఈ సమాజానికి వెలుగై నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...

- కడారి శ్రీనివాస్ 
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత
గాయకులు, సామాజిక ఉద్యమకారులు

Social Links

Related Posts

Post Comment