Marriage I ఛీ.. ఛీ.. కాసుల కోసం కక్కుర్తి.. అన్నాచెల్లెళ్లు పెళ్లి!

తాజాగా ఓ యువతి తన సోదరుడితో కలిసి పథకం ద్వారా డబ్బులు, బహుమతులు వసూలు చేసి ఏడడుగులు నడిచింది.

Marriage I ఛీ.. ఛీ.. కాసుల కోసం కక్కుర్తి.. అన్నాచెల్లెళ్లు పెళ్లి!

జయభేరి, మహరాజ్‌గంజ్, మార్చి 19:

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం పుణ్యమా అని అక్కడ ప్రతిరోజూ ఓ వింత సంఘటన చోటు చేసుకుంటోంది. ఈ పథకంలో లబ్ధి పొందేందుకు అన్న చెల్లెళ్లు కలిసి పెళ్లి చేసుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది.

Read More జర్నలిస్టుల రక్షణకు చట్టాన్ని తీసుకురావాలి..

వివరాల్లోకి వెళితే... ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద 38 పేద కుటుంబాలకు చెందిన జంటలకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మార్చి 5న మహరాజ్‌గంజ్ జిల్లా లక్ష్మీపూర్ బ్లాక్‌లో ఘనంగా వివాహం జరిపించింది. నూతన వధూవరులకు ఈ పథకం కింద గృహోపకరణాలు, రూ.35 వేల నగదు అందజేస్తారు. అయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు కొందరు మధ్యవర్తులు తరచూ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువతి తన సోదరుడితో కలిసి పథకం ద్వారా డబ్బులు, బహుమతులు వసూలు చేసి ఏడడుగులు నడిచింది. ఆమెకు ఏడాది క్రితం పెళ్లయింది. ఆమె భర్త జీవనోపాధి కోసం ప్రస్తుతం వేరే ప్రాంతంలో ఉంటున్నాడు.

Read More భారత్‌ అభివృద్ధి వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది

దీంతో మధ్యవర్తులు పథకం నిమిత్తం ఆమెను మళ్లీ పెళ్లి చేసుకునేలా ఒప్పించారు. పెళ్లి రోజున సామూహిక వివాహాలు జరుగుతున్న ఫంక్షన్ హాల్ వద్దకు ముందుగా నిర్ణయించిన నకిలీ వరుడు రాలేదు. వరుడి స్థానంలో వధువు సొంత సోదరుడిని కూర్చోబెట్టేందుకు మధ్యవర్తులు ఒప్పించారు. సంప్రదాయం ప్రకారం చెల్లెళ్లకు వివాహ వేడుకలు నిర్వహించారు. సమాచారం అందిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. మహరాజ్‌గంజ్‌లోని ఏరియా డెవలప్‌మెంట్ ఆఫీసర్ (BDO) దంపతులకు కేటాయించిన ఫర్నిచర్ మరియు డబ్బును రికవరీ చేశారు. ఈ నకిలీ పెళ్లి వ్యవహారం జిల్లా యంత్రాంగం దృష్టికి వెళ్లడంతో వెలుగులోకి వచ్చింది. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా మేజిస్ట్రేట్ అనునయ్ ఝా మీడియాకు తెలిపారు.

Read More ప్రకృతి ప్రకోపానికి బలి కాకుండా ఏమి చేయాలి...

Latest News

నేడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి నేడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి
మహాకవి దాశరథి కృష్ణమాచార్య దాశరథిగా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల...
Reba Monica John
Rashmika Mandanna
Rashi Singh
గోదావరి పుష్కర ఏర్పాట్లు షురూ...
స్మార్ట్ కార్డుల్లో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు