Arvind Kejriwa I ఈడీ కస్టడీలో లాకప్ లో భారంగా తొలిరాత్రి
కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిన్న అరెస్ట్ చేసి రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. రోస్ అవెన్యూ కోర్టు నిన్న అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు ED కస్టడీకి పంపింది. మార్చి 28 మధ్యాహ్నం రెండు గంటలకు కోర్టులో హాజరు కావాలని మళ్లీ కేజ్రీవాల్‌ను ఆదేశించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ సూత్రధారి అని ఈడీ అధికారులు ఆరోపించారు. సౌత్ గ్రూప్‌కు, నిందితులకు మధ్య మధ్యవర్తిగా ఆయన వ్యవహరించారని, లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ కింగ్ పిన్ అని, ఢిల్లీ లిక్కర్ పాలసీ, లిక్కర్ ముడుపుల కేసులో కోట్లాది రూపాయలు అందుకున్నారని ఈడీ ఆరోపించింది.
సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి ఈడీ అధికారులు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదు. ఇక అరవింద్ కేజ్రీవాల్ మాత్రం జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తానని అంటున్నారు. తాను సీఎం పదవికి రాజీనామా చేయనని అంటున్నారు. ఢిల్లీ సీఎం ఆధ్వర్యంలోని ఆప్ కూడా కేజ్రీవాల్ తమ సీఎం అని స్పష్టం చేసింది. అయితే అరెస్ట్ అయితే సీఎం రాజీనామా చేసే అవకాశం చట్టంలో లేదని కొందరు సీనియర్ లాయర్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు సీనియర్ న్యాయవాదులు రాజ్యాంగ విలువలను దృష్టిలో ఉంచుకుని అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవి నుంచి తప్పుకుంటే మంచిదని అంటున్నారు.
Post Comment