Lok Sabha : పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు

ప్రతి ఓటు విలువైనది... ప్రధాని మోదీ

Lok Sabha : పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు

జయభేరి, న్యూఢిల్లీ, మే 25 :
సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ శనివారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విట్టర్ (X) వేదికగా సందేశం ఇచ్చారు. ప్రతి ఓటు విలువైనదని, మీ ఓటును కూడా వినియోగించుకోవాలని సూచించారు. ఆరో విడత ఎన్నికల్లో భారీ సంఖ్యలో ప్రజలు ఓటింగ్ పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు. ఎన్నికల సరళిలో ప్రజలు చైతన్యవంతంగా పాల్గొంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని మోదీ తెలిపారు.

42 (1)

Read More Mukhtar Ansari death : జైలులో బాహుబలి గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి

రెండు కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు 58 లోక్ సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ఆయన సతీమణి సుదేశ్, హర్యానా సిఎం నాయబ్ సింగ్ సైనీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, లోక్ సభ అభ్యర్థి బన్సూరీ స్వరాజ్, ఢిల్లీ మంత్రులు సౌరభ్ భరద్వాజ్, ఆతిశీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, మాజీ సిఇసి సుశీల్ చంద్ర, తదితరలు తమ ఓటు హక్కును వినియోగించుకన్నారు.

Read More Isha Ambani : ఇషా అంబానీ ఇంటిని కొన్న హాలీవుడ్ న‌టి...

Views: 1

Related Posts