రత్నాలయంలో చోరీ... విలువైన బంగారు వెండి ఆభరణాలు, పంచలోహ విగ్రహాలు అపహరణ
క్లూస్ టీమ్, ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసుల వెల్లడి
జయభేరి, జులై 24:- గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలు అపహరించుకు పోయారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం అలియాబాద్ లోని రత్నాలయం లో చోటుచేసుకుంది.
Read More కుంట్లూర్ గ్రామంలో విషాదం
దీంతో పోలీసులు క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ బృందాలతో అక్కడికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. కాగా ఆలయంలో సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు, 13.5 కిలోల వెండి ఆభరణాలు, 60 కిలోల పంచలోహ విగ్రహాలు చోరీ అయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సీసీ పుటేజి ఆధారంగా నిందితులను అతి తొందర్లోనే పట్టుకుంటామని శామీర్ పేట్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read More MPDO వెంకన్న అధ్యక్షతన అవగాహన సమావేశం
Read More మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి