శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి.. దుస్థితి
ఆసుపత్రిని అందంగా తీర్చి దిద్దుటకు కావాల్సిన నిధులతో పాటు ఈ ఆసుపత్రిని 100 పడకల నుంచి 300 పడకలకు పెంచాలని ప్రతిపాదించారు. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి ఒకనాడు నిరుపేదలను తిరుపతికి వెళ్లకుండా కాపాడింది 12 మంది డాక్టర్లు అన్ని విభాగాల ఆధిపతులు సర్జన్లతో కళ కళ ఎలాంటి వ్యాధినైనా వైద్యం అందించగల్గినాము.
శ్రీకాళహస్తి :
ఒకనాడు 1500 మంది అవుట్ పేషంట్లతో కళకళ ఆడిన ఏరియా ఆసుపత్రేనా? ఇది అని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తల్లి అవాక్కయ్యారు. బుధవారం ఆమె శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి ఒకనాడు నిరుపేదలను తిరుపతికి వెళ్లకుండా కాపాడింది 12 మంది డాక్టర్లు అన్ని విభాగాల ఆధిపతులు సర్జన్లతో కళ కళ ఎలాంటి వ్యాధినైనా వైద్యం అందించగల్గినాము. గత ఐదేళ్లలో ప్రభుత్వం రూ 12 కోట్లు వెచ్చించింది మరి ఆ ఫలితం ఎక్కడ అంటూ బొజ్జల బృందమ్మ ప్రశ్నించారు.
2019 లో గెలిచిన శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఏం చేశాడు? పేదల దవాఖాన అస్తవ్యస్తంగా మారితే ఎందుకు పట్టించుకోలేదు నాడు వేళల్లో ఉన్న రోగులు నేడు వందల్లో కూడా లేదే? నాడు కాంతులు ఎన్ని జరిగేవి? ప్రస్తుతం ఎందుకు జరగడం లేదని బృందమ్మ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆమె ఆసుపత్రిని చక్కబెట్టే పనిని తన కుమారుడు సుధీర్ రెడ్డి తనకు అప్పగించాడని వివరించారు ఈ ఆసుపత్రికి పట్టిన నిర్లక్ష్యం జబ్బుకు శస్త్ర చికిత్స చేస్తానన్నారు. మూడు నాలుగు నెలల్లో ఈ ఆసుపత్రిని మళ్లీ పేదల ఆసుపత్రిక ఒక్క కేసు కూడా తిరుపతికి వెళ్లకుండా ఉండేటట్లు తీర్చి దిద్దుతామని బొజ్జల బృందమ్మ తెలిపారు.ఎటు చూసినా నిర్లక్ష్యమే తుప్పు పడుతున్న కుర్చీలు, దిండ్లకు కవర్లు లేదు.
మంచాలకు కాళ్లు లేదు ప్రతి కేసు తిరుపతికి రిఫర్ అవుతుంది అలా చేయకుండా చర్యలు తీసుకుంటాము ప్రజాసేవకు ఇష్టపడిన సిబ్బంది అయితే వారి దారి వారు చూసుకోవటం మంచిదని సుతిమెత్తగా చురకలు తగిలించారు. డయాల్సిన్ కేంద్రం తిరిగి ప్రారంభిస్తాం. ముఖ్యం గా పేదల కు సేవాలందించాలనే లక్ష్యం సిబ్బంది లో ఉండాలన్నారు నిర్లక్ష్యం చేసే వారిని సహించేది లేదని బృందమ్మ స్వష్టం చేశారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మితో చర్చించారు.
Post Comment