సీజనల్ వ్యాధుల కట్టడిలో నిర్లక్ష్యం వద్దు...
జగ్గయ్యపేటలో డయేరియాపై మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించాను. డయేరియా ప్రబలడానికి కారణాలు తెలుసుకుని.. తాజా పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించాను. తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు ఇచ్చాను. సీజనల్ వ్యాధుల కట్టడిలో నిర్లక్ష్యం వద్దని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాను. పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, కలుషిత నీటి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాను. బాధితులకు వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించాను.
Views: 0


