collector vijaya krishnan : ప్రజా సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలి కలెక్టరు విజయ కృష్ణన్

మండల, వార్డు స్థాయిలో పి.జి.ఆర్.ఎస్. అమలు

collector vijaya krishnan : ప్రజా సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలి కలెక్టరు విజయ కృష్ణన్

జయభేరి, అనకాపల్లి :
మండల స్థాయిలో  ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పి జి ఆర్ ఎస్)  కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, అన్ని శాఖల మండల స్థాయి అధికారులు హాజరుకావాలని జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు అని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి సోమవారం పత్రిక ప్రకటన ద్వారా తెలియజేసారు. 

జిల్లా కలెక్టరు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్, జాయింటు కలెక్టరు ఎం. జాహ్నవి, కె.కె.ఆర్.సి. స్పెషల్ డిప్యూటీ కలెక్టరు ఎస్.వి.ఎస్. సుబ్బలక్ష్మి,హౌసింగు ప్రోజెక్టు డైరెక్టరు శ్రీనివాసరావు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.  ప్రజలు అందజేసిన అర్జీల గూర్చి సంబంధిత జిల్లా, మండల స్థాయి అధికారులతో మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు జారీచేసారు.  అర్జీలు రీ ఓపెన్ కాకుండా పరిష్కారం చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ గ్రామ, మండల స్థాయిలో పరిష్కారం కావలసిన సమస్యల గూర్చి కూడా ప్రజలు జిల్లా కార్యాలయానికి వస్తున్నారని, అందువలన ప్రజలకు డబ్బు, సమయం వృదా అవుతున్నాయన్నారు.  

Read More వరద బాధితుల సహాయార్థం సేకరించిన విరాళాలు 

ప్రతి సోమవారం జిల్లా కేంద్రంతో పాటు  మండల కేంద్రాలలో గల తహశీల్దార్ మరియు ఎమ్.పి.డి.ఒ కార్యాలయంల వద్ద ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 2 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహించబడుతున్నదనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని, గ్రామ స్థాయిలో ప్రచారం చేయాలని  జిల్లా కలెక్టరు తెలిపారు. మండల కార్యాలయంలో అందజేసిన ప్రతి ధరఖాస్తుపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, తీసుకున్న చర్యలను సమీక్షించడం జరుగుతుందని జిల్లా కలెక్టరు తెలిపారు.  కావున అచ్చట కూడా ప్రజలు సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తు చేసుకొనవచ్చునని తెలిపారు. 

Read More  వరద ప్రభావిత ప్రాంతాల్ల వారికి భరోసా..

మండల, మున్సిపాలిటీ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయి పిజిఆర్ఎస్ లో సమర్పించాలని  సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అందుకుగాను  వచ్చిన ప్రతీ అర్జీని అవగాహన చేసుకోవడం, అర్జీదారుని వద్దకు వెళ్లి సమస్య గూర్చి మాట్లాడడం, సమస్య సంబంధిత శాఖ పరిధిలోనిది కాకపోతే తెలియజేయడం, అందుకు గల కారణాలను వివరించడం, తదుపరి కార్యాచరణ పై అర్జీదారునికి అవగాహన కల్పించడం వంటి పంచ సూత్రాలను పాటించాలని అధికారులను జిల్లా కలెక్టరు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read More ఏపీలో ఎన్నికలను తలపిస్తున్న మద్యం లాటరీ కేంద్రాలు