anupama parameswar kiss : అనుపమ కిస్సుల గోల..
గ్లామర్ గేట్లు ఎత్తేసి లిల్లీ రోల్ లో అదరగొట్టేసింది. ఆడియన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది.
సినిమాలో పక్కింటి అమ్మాయి ఇమేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీని చూసి చాలా మంది షాక్ అయ్యారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టిల్లూ స్క్వేర్‌లో గ్లామరస్ పాత్రలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై అనుపమ ఘాటుగా స్పందించింది. లిప్ లాక్ సీన్‌లో తన నటనను అందరూ పెద్ద తప్పు చేసినట్లుగా విమర్శిస్తున్నారు. 18 ఏళ్ల వయసులో ముద్దుల సన్నివేశాల్లో గ్లామర్‌గా నటించనని చెప్పానని, ఇప్పుడు అలా చేయనని చెప్పింది. ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా చాలా పరిణితి వచ్చిందని క్లారిటీ ఇచ్చింది. ఏదైనా సినిమా కథకు అవసరమైతే లిప్ లాక్ లాంటి సన్నివేశాల్లో నటించడం అస్సలు తప్పు కాదని అనుపమ అన్నారు. ఒకే తరహా పాత్రల్లో నటించడం బోర్‌గా ఉందని, అన్ని పాత్రలు చేయాల్సిందేనని చెప్పింది.
సినిమా చూడకుండా వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదు. థియేటర్లలో సినిమా చేయక ముందు పొగడ్తలు, విమర్శలు ఉండవద్దని నిప్పులు చెరిగారు. అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే మలయాళ చిత్రం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ డబ్బింగ్ పూర్తయింది. కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు సౌత్‌లో మరిన్ని సినిమాలు చేస్తోంది. మరి కొత్త సినిమాలతో అనుపమ ఎలా అలరిస్తుందో చూడాలి.
Post Comment