Ugadi : దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు

దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం నందు కవి సమ్మేళనం నిర్వహించడం జరిగినది.

Ugadi : దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు

జయభేరి, దేవరకొండ :
దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం నందు కవి సమ్మేళనం నిర్వహించడం జరిగినది. ఉగాది పురస్కరించుకొని తెలుగు నామ సంవత్సరం ప్రకారము, ప్రతి ఒక్కరూ నూతన సంవత్సర మరియు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. అనంతరం తాము రాసిన కవిత్యాన్ని కవులు వినిపించారు. గాయకులు పాటలు పాడడం జరిగినది, అధ్యక్షుడు NVT, మాట్లాడుతూ దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ కళాకారులకు క్రీడాకారులకు ఎప్పుడు వెన్నంటి ఉంటుందని, ప్రతి సంవత్సరము ఉగాది రోజున ఉగాది పురస్కారాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.

ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలు సంపదలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, PJ శాంసన్, తాళ్ల సురేష్, S వెంకన్న, రాపోలు నిరంజన్, భాస్కర్, హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు, పృద్వి, శ్రీనయ్య, రాజకుమార్, రాహుల్, సన్మాన గ్రహీతలు పర్చ వాసుదేవరావు, ఉడుత సలేశ్వర్ యాదవ్, రంజాన్ బేగ్, మెరుగు శ్రీను, త్రివేణి, లక్ష్మీనారాయణ, jనల్ల నరసింహ, క్రాంతి, రాక్ స్టార్ రమేష్, డైరెక్టర్ వాసు, ST సింగర్ అమర్, బిక్షమయ్య, శ్రీనివాస్, నగేష్, శేఖర్, పియానో శేఖర్, డాన్స్ మాస్టర్ జగన్, క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

Read More కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం