Ts inter : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో స్టేట్ ర్యాంక్ సాధించిన ఘనత విజన్ జూనియర్ కళాశాల
ఎంపీసీలో స్టేట్ మూడవ ర్యాంకు సాధించిన విద్యార్థిని.. గోవిందం హిమవర్ష...
- బోడుప్పల్ లోని విజన్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో కలిసి సంబరాలు జరుపుకున్న కాలేజీ యాజమాన్యం...
- నిరుపేద కుటుంబంలో పుట్టిన గోవిందం హిమవర్ష..
- విజన్ ఇంటర్ కాలేజీ అధ్యాపకుల మన్నలను పొందుకుంది
జయభేరి, బోడుప్పల్:
ఈ సందర్భంగా విజన్ ఇంటర్ కాలేజీ కాలేజీ డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, భావన ఋషి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే విజన్ ఇంటర్ కాలేజీ ప్రిన్సిపల్ కే రమాకాంత్, డాక్టర్ నెల్లూరి దానయ్య, తమ విద్యార్థిని స్టేట్ ర్యాంకు సాధించడం పై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిజంగా ఇలాంటి విద్యార్థులను మా కాలేజీలో చదువుకున్నందుకు మాకు చాలా గర్వకారణంగా ఉందని, స్టేట్ ర్యాంకుల్లో మూడవ ర్యాంకును సాధించిన ఘనత కూడా విజన్ ఇంటర్ డిగ్రీ కాలేజీకి దక్కుతుంది అని గర్వంగా చెప్పుకొచ్చారు ప్రిన్సిపల్ డాక్టర్ నెల్లూరు దానయ్య.
ఈ సందర్భంగా కాలేజీ డైరెక్టర్లు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ నాణ్యమైన విద్య వీటితోపాటు నిరంతర కటోరమైన శ్రమను మా కాలేజీలో అందిస్తూ విద్యార్థులకు ఒక మార్కులే కాదు వారి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదిగేందుకు విలువలు కలిగిన విద్యను అందిస్తున్నది మా సంస్థ అంటూ గర్వంగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా విజన్ ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపల్ కే రమాకాంత్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్న ఈ నేపథ్యంలో విద్య తో పాటు అనుకువ కలిగి మంచి వ్యక్తిత్వం కలిగి స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థిని గోవింద హిమా వర్ష కు శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా విజన్ ఇంటర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు విద్యార్థినితోపాటు కాలేజీ యాజమాన్యం టపాసులు కాల్చి తమ ఆనందాలను సంతోషాలను పంచుకొని విద్యార్థిని సగరవంగా శాలువా కప్పి గౌరవించి సన్మానించారు.....
Latest News
11 Mar 2025 10:44:11
జయభేరి, దేవరకొండ : దేవరకొండ మండలం తాటికొల్ గ్రామపంచాయతీ పరిధిలోని వాగులో ఇసుక రీచ్ కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ
Post Comment