చదువుకుంటేనే గుర్తింపు ఉంటుంది

చదువుకుంటేనే గుర్తింపు ఉంటుంది

జయభేరి, డిoడి :
తావాక్లపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యయులు శనివారం డిండి మండలం శేషాయికుంటలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో చదువులు నేర్చుకోండి. సంస్కారం పెంచుకోండి అని గ్రామాల్లో డోర్ టు డోర్ వెళ్లి  వెళ్లి ఉపాధ్యాయులు ప్రజలను, విద్యార్థుల తల్లితండ్రులను చైతన్యపరిచారు. 

ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్,  ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు ఉచిత,ఏకరూప దోస్తులు పోషక విలువలతో కూడిన భోజనం విద్యావంతులైన ప్రతిభావంతులైన, ఉపాధ్యాయుల బృందం, సకల సౌకర్యాలతో విద్యార్థులకు విద్యను అందించడం జరుగుతుందని అన్నారు కావున ప్రభుత్వ బడులోనే బాల బాలికలకు చేర్పించి ఈ అవకాశం ఉపయోగించుకోవాలని కోరారు.విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ వసతులను ఉపయోగించుకొని ఉన్నతులుగా ఎదగాలని అన్నారు.సమాజంలో చదువు ఉంటేనే గుర్తింపు ఉంటుందని,జీవితానికి ఒక లక్ష్యం ఏర్పడుతుందని, అందుకు నిరుపేద పిల్లలు బాగా చదువుకొని ఉన్నత శిఖరాల అధిరోహించాలని అన్నారు.కే.వెంకట్ రెడ్డి,ఎం. జ్యోతి, ఎన్.ఇందిరమ్మ, కే. శ్రీనివాసులు, మమతా, ఉషారాణి,నగేష్,శ్రీనివాస్,లచ్చిరాం, దివ్యశ్రీ చాంద్ పాషా  గ్రామ ప్రజలు, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.

Read More Telangana I కంచర గాడిద.. రేసుగుర్రం... సన్నాసి! దద్దమ్మలు! దున్నపోతును కొనుక్కున్నది ఎవరు?

Views: 0