సాయుధ పోరాట కాలపు తొలి అమరుడు శ్రీ దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయం
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలకు ఊపిరిలూదిన సాయుధ పోరాట కాలపు తొలి అమరుడు శ్రీ దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయం అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తాలో గల విగ్రహానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... భూమి కోసం,భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు శ్రీ దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ప్రతి ఒక్కరూ నివాళులు అర్పించడం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, హమాలీ శ్రీనివాస్, డివిజన్ BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


