ఆ.. అనాధ కు అన్నీ తామై.. మానవత్వం చాటుకున్న మానుకోట పోలీసులు..
మహబూబాబాద్ జిల్లాఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ ఆదేశాలతో.. శశిరేఖ దశదినకర్మకు పోలీసులచే సహపంక్తి బోజనం ఏర్పాటు.. దిక్కులేని బిడ్డకు.. పెద్దదిక్కుగా నిలిచిన ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్, సార్ చల్లంగా ఉండాలని దీవించిన జనం...!! మాయమయ్యి పోతున్నడమ్మా.. మనిషన్నవాడు..! మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు..!! నూటికో.. కోటికో.. ఎక్కడో ఒక్కడూ.., ఏడ ఉన్నడొకాని జాడకు కనరాడు..??!! అని ఓ..మహాకవి వెదుకులాటకు మహబూబాబాద్ జిల్లాలో సమాదానం దొరికింది..!!!
జయభేరి :
మానస విషయాన్ని వాట్సాప్ గ్రూప్ లో చూసిన జిల్లాఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్.. ఆరోజు వెంటనే కురవి ఎస్ఐ గోపిని బాలిక ఇంటికి పంపించారు. తినడానికి తిండిగింజలు కూడా లేవనే పరిస్థితి తెలుసుకొని.., నిమిషాలలో అరక్వింటాబియ్యం, పదిరోజులకు సరిపడా నిత్యవసరసరుకులు అందించారు. రూరల్ సిఐ సర్వయ్య ను పంపించి ఎప్పటికప్పుడు అమ్మాయి యోగక్షేమాలు వాకబు చేసారు. అంతేకాకుండా కురవిలో బుధవారం సాంప్రదాయబద్దంగా మానస చేత శశిరేఖకు దశదినకర్మ నిర్వహించారు.
ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ ఆదేశాలతో సుమారు 150మందికి మంచి మాంసహారబోజనాన్ని ఏర్పాటు చేసారు... అనాధ ఇంటికి ఆత్మీయ అతిధులుగా.. ఊహించని బందువులుగా మానస వద్దకు అడిషనల్ ఎస్పీ చెన్నయ్య, మహబూబాబాద్ డిఎస్పీ తిరపతిరావు, రూరల్ సిఐ సర్వయ్య, కురవి ఎస్ఐ గోపి వచ్చి శశిరేఖ చిత్రపటానికి నివాళులు అర్పించారు. పంక్షన్ హాల్ లో బోజనాలను ఏర్పాటు చేసి.. వారే స్వయంగా వడ్డించి..., ఇష్టపంక్తి బోజనాన్ని నిర్వహించారు. శశిరేఖ మరణవార్తను, మానస దయనీయ పరిస్థితిని వాట్సప్ గ్రూప్ ద్వారా వెలుగులోకి తెచ్చిన మహబూబాబాద్ జిల్లా టియుడబ్ల్యూజే(ఐజేయు) జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ ను కూడా ఈ సందర్భంగా పోలీస్ అధికారులు అభినందించారు..
మానవత్వంతో స్పందించి అనాధకు అన్నీ తామై ఆసరాగా నిలిచిన మహబూబాబాద్ జిల్లాఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్, జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఈ..సంఘటన తెలిసిన ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. ఇంతటి చక్కటి మనసున్న మీరు నిండునూరేళ్ళు చల్లంగా బ్రతకాలని, మీ.. పిల్లాపాపలు హాయిగా ఉండాలని దీవించారు...
Post Comment