తెలంగాణ తొలి అమర తేజం, తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమరయ్య

మీసాల అరుణ్ కుమార్

తెలంగాణ తొలి అమర తేజం, తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమరయ్య

ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 169వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్య అతిధిగా దయ్యాల గట్టయ్య (వ్యవస్థపాకులు, కురుమ సంఘం, ఘట్కేసర్ మున్సిపాలిటీ), చిందం శ్రీశైలం (అద్యక్షులు, కురుమ సంఘం, ఘట్కేసర్ మున్సిపాలిటీ), దయ్యాల రమేష్ (ప్రధాన కార్యదర్శి, కురుమ సంఘం, ఘట్కేసర్ మున్సిపాలిటీ) విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు, దయ్యాల గట్టయ్య మాట్లాడుతూ... డా.బాబాసాహెబ్ అంబెడ్కర్ లాంటి మహనీయుడిని ప్రతినిత్యం స్మరించుకోవడం చాలా గొప్ప నిర్ణయం.

అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన వారు కారు, భారత దేశం లో ఉన్న సబండ వర్గాలకి చెందిన వారు. డా. బాబాసాహెబ్ తప్ప భారత దేశానికి ఏ ఒకరు కూడా ఇలాంటి అద్భుతమైన రాజ్యాంగాని రచించలేకపోయేవారు. ప్రపంచ మేధావి అయినా డా.బాబాసాహెబ్ అంబెడ్కర్ 18 డిగ్రీలు చదివి, ప్రపంచంలో ఉన్న 60 దేశాల రాజ్యాంగాలు చదివి మన భారతదేశా పరిస్థితులకు అనుగుణంగా భారత రాజ్యాంగాని లింకించడం వల్లనే ఈరోజు భారత దేశం శాశ్యశాలమంగా ఉంది అని తెలియజేసారు. ప్రతివారం ఇలా భారత రాజ్యాంగ పీఠిక పై ప్రమాణ స్వీకారం చేయించటం భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలలోకి తీసుకెళ్లడమే అని తెలియజేసారు. ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలని చైతన్య పరుస్తున్న యం.అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించరు. దొడ్డి కొమరయ్య ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని తెలియజేసారు.

Read More రేవంత్ రెడ్డి కి ఓటు వేసి తప్పు చేశాం అంటున్న ప్రజలు....

దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించరు. సచిన్ దొడ్డి కొమరయ్య జీవిత చరిత్రని పూర్తిగా తెలియజేసారు. 1946 జూలై 4వ తేదీ దొడ్డి కొమురయ్య అమరత్వం పొందిన రోజు. ఆనాటి వరంగల్ జిల్లా కడివెండి (ప్రస్తుతం జనగాం జిల్లాలో వుంది) గ్రామానికి చెందిన పేదరైతు యువకుడు అయిన కొమురయ్య స్థానిక 'వలంటీరు దళం'లో సభ్యుడుగా ఉండేవాడు.

Read More శరన్నవరాత్రి మహోత్సవం

అప్పటి తెలంగాణలోని నిజాం సంస్థానంలో అత్యంత క్రూరులైన ఫ్యూడల్ భూస్వాములు అనేకమంది ప్రజలపై తీవ్రమైన దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడేవారు.అలాంటి ఒక భూస్వామి(జనగామ తాలూకా విసునూరు దేశముఖ్) సాయుధ దౌర్జన్యాలను తిప్పికొట్టడానికి అప్పటి కమ్యూనిస్టు పార్టీ ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన వలంటీరు దళం చేసిన ఒక ప్రదర్శనలో పాల్గొంటున్న కొమురయ్యను కాల్చి చంపారు.విసునూరు దేశ్ ముఖ్ తల్లి ఈ కడివెండి గ్రామంలో నివసిస్తూ ఉంది.ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ప్రదర్శనపై దాడిచేసి ఆ ఫ్యూడల్ భూస్వామి సాయుధ బలాలు చేసిన దుష్కృత్యం ఇది. ఈ సందర్భంగా ఆనాడు తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు చూద్దాం. తెలంగాణలో ప్రజాఉద్యమాన్ని 1940 నాటినుండే కమ్యూనిస్టు పార్టీ ప్రారంభించి నడుపుతుండేది.

Read More మోటార్ సైకిల్ దొంగలించిన నిందితుడు అరెస్టు 

వెట్టిచాకిరీ రద్దు చేయాలనీ, కౌలు కొమురయ్య. దారులను భూముల నుండి తొలగించడాన్ని (బేదఖళ్ళు) వ్యతిరేకిస్తూ పోలీసు, రెవిన్యూ ప్రతినిధులైన పటేల్, పట్వారీలు ప్రజలనుండి అక్రమ వసూళ్ళను ఆపాలనీ, యుద్ధం పేరుతో రైతాంగం నుండి బలవంతపు ధాన్యపు వసూళ్ళను వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టు పార్టీ, 'ఆంధ్ర మహాసభ ప్రజల్లో పనిచేసి విప్లవోద్యమానికి అంకు రార్పణ చేశాయి. 1946 ప్రారంభంలో ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో రెండు ముఖ్య సంఘటనలు జరిగాయి.

Read More రూ.32,237 కోట్లతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ...

నల్లగొండ జిల్లాలో ఆకునూరు గ్రామంలో, గుల్బర్గా జిల్లాలోని మాచిరెడ్డిపల్లి గ్రామంలోని ప్రజలు ప్రభుత్వ నిర్బంధపు ధాన్యసేకరణను వ్యతిరేకిస్తూ ధాన్యం ఇవ్వడానికి తిరస్కరించారు. తర్వాత సాయుధ పోలీసులు ఈ రెండు గ్రామాలపై దాడిచేసి ప్రజలపై క్రూరమైన నిర్బంధాన్ని అమలుచేశారు. అరెస్టులు, చిత్రహింసలు, ప్రజల ఇండ్లను లూటీచేయటం, స్త్రీలపై పాశవిక అత్యాచారాలు చేసి ఆ రెండు గ్రామాలను శ్మశానాలుగా మార్చారు. దీంతో కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభ పరిధిలోని అన్ని గ్రామాల్లో భూస్వామ్య పోలీసు దౌర్జన్యాలను ఎదు ర్కోవడానికి 'వలంటీరు దళాల'ను ఆర్గనైజు చేయాలనీ, రెగ్యులర్గా ప్రజాప్రదర్శన లను నిర్వహించాలనీ, దౌర్జన్యాలకు నిరసనగా రోజూ వలంటీరు దళాలు ఊరేగింపు జరపాలనీ పార్టీ కార్యక్రమం ఇచ్చింది. 1946 ప్రారంభంలో తెలంగాణలో వ్యవసాయ విప్లవం ప్రారంభమైంది.

Read More శ్రీ గౌరీ అవతారంలో అమ్మవారు 

ఈ విప్లవంలో మొదటిసారిగా భూస్వాముల తుపాకి గుండ్లకు గురియైనది కడివెండి గ్రామానికి చెందిన దొడ్డి కొమురయ్య.ఆయన అమరత్వం, స్మృతి కమ్యూనిస్టు విప్లవ కారులను నిరంతరం వ్యవసాయ విప్లవోద్యమ కర్తవ్యో న్ముఖులను చేస్తూనే ఉంటుంది. ఒక నూతన ప్రజాతంత్ర వ్యవస్థ స్థాపన ప్రజల సాయుధ పోరాటంద్వారానే సాధ్యమవుతుందని కొమురయ్య లాంటి అమరవీరులు చాటి చెప్పారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఎం.అరుణ్ కుమార్. ఈ రోజు సూక్తి  చెప్పారు బి.గణేష్ గౌడ్ : మనస్సును పెంపొందించుకోవడం మానవ ఉనికి యొక్క అంతిమ లక్ష్యం అని అంబేద్కర్ మాటలు గుర్తుచేశారు.

Read More ఇక హైదరాబాద్‌లో ‘డీజే’ చప్పుడు బంద్..!!

ఈ కార్యక్రమం లో మేకల దాస్(అద్యక్షులు, అంబేద్కర్ యువజన సంఘం, ఘట్కేసర్ మున్సిపాలిటీ), కె.నర్సింగ్ రావు, మేకల నర్సింగ్ రావు, మీసాల రాజేష్ కుమార్, బి.మహేందర్, సదర్శ వడ్డెర, కె.సత్యం, డి.పరమేష్, రాజు, బి.గణేష్ గౌడ్, ఇ.జగదీష్, ఎన్.నర్సింగ్ రావు, ఎస్.కృష్ణం రాజు, ఇ.విష్ణు, జి.సచిన్, బి.వివేక్, జె.సాయి చరణ్, బి.యాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More పరిశుద్ధ కార్మికులకు దసరా పండుగ సందర్భంగా కొత్త బట్టలు