ఆ మహిళా మంత్రి నా కుటుంబానికి క్షమాపణలు చెప్పలి

 ఆ మహిళా మంత్రి నా కుటుంబానికి క్షమాపణలు చెప్పలి

హైదరాబాద్‌: తమ కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ  చేసిన వ్యాఖ్యలపై అక్కినేని అమల స్పందించారు. ఒక మంత్రి అయిఉండి ఆమె అలా మాట్లాడటం దారుణమని పేర్కొన్నారు.

రాజకీయాల కోసం అలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటని పేర్కొంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘ఒక మహిళా మంత్రి కల్పిత ఆరోపణలు చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడటం దిగ్భ్రాంతికరం.

Read More Telangan Sand I తెలంగాణ చరిత్ర, జాతి, ఎన్నటికీ క్షమించదు... ప్రకృతి సంపదను కొల్లగొట్టిన గత ప్రభుత్వపు పాలన...

నా భర్త గురించి తప్పుడు కథనాలు చెబుతున్న ఇలాంటి వ్యక్తులను నమ్ముతున్నారా? ఇది నిజంగా సిగ్గుచేటు. నేతలు ఇంతలా దిగజారి ప్రవర్తిస్తే మన దేశం ఏమవుతుంది? రాహుల్ గాంధీ.. మీరు వ్యక్తుల గౌరవమర్యాదలను నమ్మినట్లయితే.. దయచేసి మీ నేతలను అదుపులో ఉంచుకోండి. ఆ మహిళా మంత్రి నా కుటుంబానికి క్షమాపణలు చెప్పి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోండి. ఈ దేశ పౌరులను రక్షించండి’’ అని ట్వీట్‌ చేశారు.̲

Read More GHMC I శివ శివ.. హర హర...

Views: 0