సరైన పరిహారం ఇచ్చి భూనిర్వహితులను ఆదుకోండి

రైతుకు ఎకరాకు పది లక్షలు ఇచ్చి కోట్లుకు అమ్ముకున్నారు... హామీలను అమలు చేయండి లేదంటే పరిశ్రమలను నడవనీయం

సరైన పరిహారం ఇచ్చి భూనిర్వహితులను ఆదుకోండి

జయభేరి, గజ్వేల్, సెప్టెంబర్ 24: 
పేదల భూములను ఫుడ్ ప్రాసెసింగ్ కోసం భూసేకరణ జరిపిన గత ప్రభుత్వం, కోట్లు విలువ చేసే రైతుల భూములను నామమాత్రపు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని రెండవ రోజు పరిశ్రమల వద్ద రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా వర్గల్ లో నిర్మాణంలో ఉన్న పరిశ్రమల వద్ద మంగళవారం రైతులు నిరసన తెలుపుతూ రైతులకు రికార్డు ప్రకారం ఉన్న భూములకు సైతం సరైన పరిహారం ఇవ్వకుండా రోడ్డున పడేశారని భూనిర్వాయితులు పరిశ్రమల వద్ద ఆందోళన చేసి చేస్తున్న పనులను నిలిపివేశారు. 

గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమల పేరిట 1495,1510 సర్వే నెంబర్లలో భూసేకరణ చేశారన్నారు.ఈ సందర్భంగా తమకు ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయలేదన్నారు. భూములు కోల్పోయిన కొందరు రైతులకు నష్టపరిహారం, ఇండ్ల పట్టాలు ఇవ్వలేదని, రెవెన్యూ అధికారులు సమగ్ర సర్వే జరిపి న్యాయం చేయాలన్నారు. హామీకి అనుగుణంగా ప్రతి ఒక్కరికి ప్లాట్లు, ప్యాకేజీలు పూర్తిస్థాయిలో అందించిన తరువాతే పరిశ్రమల నిర్మాణాలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూనిర్వాయితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Read More రేవంత్ రెడ్డి కి ఓటు వేసి తప్పు చేశాం అంటున్న ప్రజలు....