20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జయభేరి, ములుగు, జనవరి 28 :
గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004- 2005 సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. 20 సంవత్సరాల పూర్వ విద్యార్థులు ఓప్రవేట్ ఫంక్షన్ హాల్ లో కలుసుకొని వారు చేసిన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.