రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు  కలెక్టర్

రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు  కలెక్టర్

జయభేరి, దేవరకొండ :
విద్యార్థులు చదువు పైనే దృష్టి సారించి మంచి లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శనివారం ఆమె నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణం లోని పలు రెసిడెన్షియల్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ముందుగా తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర  కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వంటగదిని, స్టోర్ రూమ్ ను పరిశీలించారు. స్టోర్ రూమ్ లోకి ఎలుకలు, బల్లుల వంటివి రాకుండా శుభ్రంగా ఉంచాలని, స్టాకు ఎప్పటి స్టాక్ అప్పుడే వినియోగించాలని,నిలువ ఉంచవద్దని, ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు ఆహారం నాణ్యత లోపం వలన ఇబ్బంది పడకూడదని, నాణ్యమైన భోజనాన్ని అందించాలని పాఠశాల ప్రిన్సిపాల్ హనుమంతు అశోక్ ను ఆదేశించారు.

Read More Telangana | టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన యువకులు

ఈ సందర్భంగా ఆమె పాఠశాల కార్యక్రమాలను, సమయాన్ని అడిగి తెలుసుకున్నారు.వంటగది శుభ్రంగా ఉండాలని చెప్పారు.డైనింగ్ ను తనిఖీ చేసి డైనింగ్ సైతం ఎప్పటికప్పుడు శుభ్రంగాbఉంచాలన్నారు. అనంతరం  దగ్గర్లో ఉన్న తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. వంటగదిలో పరిశుభ్రతను పరిశీలించి ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థినిలతో కలిసి సాయంకాల అల్పాహారాన్ని తీసుకున్నారు.

Read More Congress I వ్యవస్థీకృత విధ్వంసం ప్రజా పాలన కొనసాగేదెలా...!?

ఈ సందర్భంగా ఆమె  విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ విద్యార్థినిలు తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, ముఖ్యంగా భోజనానికి ముందు తర్వాత శుభ్రంగా చేతులను కడుక్కోవడం వంటివి పాటించాలన్నారు. పాఠశాలలో భోజనం, ఇతర సౌకర్యాలు బాగా కల్పిస్తుండటం  పట్ల ఆమె పాఠశాల ప్రిన్సిపల్ కళ్యాణిని అభినందించారు. విద్యార్థినులు ర్యాంకులపై కాకుండా చదువుపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా విద్యార్థులకు బోధించారు.

Read More Telangan I తలరాత మార్చే విద్య తల వంపులు పాలవుతోందా!?

ఫిజిక్స్ తదితరులు సబ్జెక్టులపై ఆమె విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు .బాగా కష్టపడి చదివితే మంచిర్యాంకులు వాతనంతట ఆవే వస్తాయని ఆమె తెలిపారు.అనంతరం పక్కనే ఉన్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని సందర్శించి పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం పెడుతున్నది లేనిది విద్యార్థినులతో అడిగి తెలుసుకున్నారు. అంతేగాక అల్పాహారం కింద  ప్రతి రోజు ఇస్తున్న వివరాలు,మద్యాహ్నం భోజనం, రాత్రి భోజనం గురించి అడిగారు. పాఠశాల పరిసరాలు,వంట గది,డైనింగ్  శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, ఎలాంటి చిన్న లోపం  రాకుండా చూసుకోవాలని, భోజనం  నాణ్యత విషయంలో రాజీ పడవద్దని చెప్పారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

Read More Telangan Sand I తెలంగాణ చరిత్ర, జాతి, ఎన్నటికీ క్షమించదు... ప్రకృతి సంపదను కొల్లగొట్టిన గత ప్రభుత్వపు పాలన...

WhatsApp Image 2024-11-23 at 20.45.06

Read More BJP_Bandi Vs Ponnam I విజయ సంకల్ప యాత్ర ..? అసలు ఉద్దేశం ఏంటి!?

దేవరకొండ  ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అలాగే శేరిపల్లి వద్ద స్థానిక శాసనసభ్యులు బాలునాయక్ తో కలిసి  నూతన ఆసుపత్రి భవన  నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు.ఆ తర్వాత ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీని పరిశీలించారు. డి పి ఆర్ ఓ వెంకటేశ్వర్లు, దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, తహసిల్దార్ సంతోష్ కిరణ్, తదితరులు ఉన్నారు.

Read More Telangana 26th I భద్రతకు భరోసా ఏది!? 

Views: 0