హన్మకొండలో రౌడీయిజం

ఆస్తి ఇప్పిస్తానని.. వితంతువుని బ్లాక్ మెయిల్

తొలుత రూ.2 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నారు. తన వెనుకాల ఎవరు లేరని బెదిరించి రెండోసారి రూ.4.50 లక్షలు, 6 తులాల బంగారం, పది తులాల వెండి తీసుకున్నాడు. పనిచేసే పెట్టకుండా బెదిరింపులకు గురిచేస్తూ శారీరకంగా లొగి పోవాలని లేకుంటే నిన్ను, నీ కూతురిని చంపేస్తానని అతను అతని అనుచరులతో బెదిరిస్తున్నాడు. ఒకసారి సుభాష్ భార్య, కొడుకు హన్మకొండలో తాను కిరాయి ఉన్న ఇంటికి వచ్చి దాడి చేసి కొట్టారని బాధితురాలు లక్ష్మి ఈ మేరకు వరంగల్ సీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.

హన్మకొండలో రౌడీయిజం

జయభేరి, హన్మకొండ :
వితంతువు మహిళాకు చెందిన ఆస్తిని ఇప్పిస్తానని నమ్మబలికి మోసగించిన ఉదంతమిది. ఆ రౌడీయిజం చలాయిస్తున్న అతడిని తెలిసిన వ్యక్తిని పరిచయం చేయడంతో ఏకంగా రూ.6.50 లక్షలు, 6 తులాల బంగారం, పది తులాల వెండి డిమాండ్ చేసి తీసుకున్న తంతు ఇది.

వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తికి చెందిన తోటకూరి లక్ష్మి గ్రామంలో 2014 నుంచి 2019 వరకు సర్పంచ్ గా పదవి నిర్వహించింది. తన భర్త చక్రపాణి మొదటి భార్య చంద్రకళ మృతి కిందగా 20 సంవత్సరంల క్రితం తనను రెండవ పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అతనికి ఇద్దరు కుమారులు ఉండగా..రెండవ కుమారుడు మృతి చెందాడు. భర్త మృతి అనంతరం పరిస్థితులు తారుమారు అయ్యాయి. పినతల్లి అయిన తనకు ఆస్తిలో వాటా లేదని మొదటి భార్య కొడుకు బిక్షపతి నన్ను వెళ్లగొట్టాడు. కట్టుబట్టలతో హన్మకొండకు వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న తన వద్దకు కనిపర్తికి చెందిన జంగిలి రాజు వచ్చి కరీమాబాద్ కు చెందిన బండి సుభాష్ అనే వ్యక్తితో సుపారి మాట్లాడాడు. తొలుత రూ.2 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నారు.

Read More Anganwadi I అద్దె భ‌వ‌నాల్లోనే అంగ‌న్‌వాడీలు

తన వెనుకాల ఎవరు లేరని బెదిరించి రెండోసారి రూ.4.50 లక్షలు, 6 తులాల బంగారం, పది తులాల వెండి తీసుకున్నాడు. పనిచేసే పెట్టకుండా బెదిరింపులకు గురిచేస్తూ శారీరకంగా లొగి పోవాలని లేకుంటే నిన్ను, నీ కూతురిని చంపేస్తానని అతను అతని అనుచరులతో బెదిరిస్తున్నాడు. ఒకసారి సుభాష్ భార్య, కొడుకు హన్మకొండలో తాను కిరాయి ఉన్న ఇంటికి వచ్చి దాడి చేసి కొట్టారని బాధితురాలు లక్ష్మి ఈ మేరకు వరంగల్ సీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.

Read More Telangana MP I టార్గెట్ @17

బండి సుభాష్ పై కఠిన చర్యలు తీసుకోవాలి 
-మహిళా సంఘం నాయకురాలు చెక్క స్వప్న
కాపుల కనపర్తి గ్రామానికి చెందిన వితంతు మహిళల.. మాజీ సర్పంచ్ తోటకూరి లక్ష్మి భర్త కీ: శే: చక్రపాణికీ సంబంధించిన వాటా భూమిని నీ కూతురికి ఇప్పిస్తానని ఒక పెద్ద పేరు మోసిన నాయకుని పేరు చెప్పి ఆమె వద్ద రూ.6.50 లక్షలు, 6 కులాల బంగారం, 10 తులాల వెండిని తీసుకున్న బండి సుభాష్ ఇట్టి విషయాన్ని బయటకు పొక్కకుండా ఆమెను బలవంతంగా శారీరకంగా లొంగదీసుకునేందుకు యత్నించగా.. భయభ్రాంతులతో కూతురుని తీసుకొని కిరాయి ఉన్న ఇంట్లో నుంచి.. బయటకు వచ్చి తలదాచుకుంటుందని ఇట్టి విషయమై హన్మకొండలోని కమిషనరేట్ లో సిపిని కలిసి ఆమెతో ఫిర్యాదు చేయించినట్లు స్వప్న తెలిపారు. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ.. బ్లాక్ మెయిలర్ బండి సుభాష్ పై తగిన చర్యలు తీసుకుని ఆమెకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటానని సిపి తెలిపినట్లు స్వప్న విలేకరులకు తెలిపారు.

Read More Telangana I రాజకీయాలు.. పోలీసులు...

Views: 0