Phone Tapping Case : రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర వార్ రూమ్ ఏర్పాటు?
ఫోన్ ట్యాపింగ్ కేసులో షాకింగ్ కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగు చూస్తున్న షాకింగ్ నిజాలు.. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.. రేవంత్ రెడ్డి, కుటుంబ సభ్యులు, అనుచరులపై నిఘా కోసం గెస్ట్ హౌస్.. రేవంత్ రెడ్డికి సమీపంలోని ఓ ఇంట్లో వార్ రూం జూబ్లీహిల్స్‌లో నివాసం..
రాధాకిషన్ రావు పోలీసు కస్టడీ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో విచారణ వేగవంతం చేశారు. నిఘా అధికారుల ఫోన్ ట్యాపింగ్ కారణంగానే 2015 ఓటుకు నోటు వ్యవహారం, 2022లో ఎమ్మెల్యేలకు ఎర వేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రభాకర్‌రావు ఎస్‌ఐబీ చీఫ్ అయ్యాక ఫోన్ ట్యాపింగ్ దుర్వినియోగమైనట్లు తేలింది. తొలినాళ్లలో, డిపార్ట్‌మెంట్ చట్టపరమైన ఇంటర్‌సెప్షన్ అని పిలువబడే చట్టపరమైన ప్రక్రియ ద్వారా అవసరమైన ఫోన్ నంబర్‌లను ట్యాప్ చేసింది. కానీ 2018 నుంచి వారి ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు రాధాకిషన్ రావు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఫోన్లతో పాటు సోషల్ మీడియా ట్యాపింగ్ పై దృష్టి సారించారు.
Post Comment