ప్రజల్లో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పెరుగుతుంది - నక్క ప్రభాకర్ గౌడ్

మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి కి మద్దతుగా నేతల ఇంటింటి ప్రచారం

ప్రజల్లో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పెరుగుతుంది - నక్క ప్రభాకర్ గౌడ్

జయభేరి, ఏప్రిల్ 14 :
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మల్కాజ్ గిరి లోక్ సభ నుండి కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన పట్నం సునీత మహేందర్ రెడ్డి కి మద్దతుగా తుంకుంట మున్సిపల్ పరిధిలోని ఉప్పర్ పల్లి, తుంకుంట, సింగాయిపల్లి, పోతాయిపల్లి, దేవరయాంజాల్ గ్రామాల్లో ఆ పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, ఉమ్మడి షామిర్ పేట, మేడ్చల్ మండలాల ఎన్నికల ఇంచార్జ్ నక్క ప్రభాకర్ గౌడ్, తుంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమిడి జైపాల్ రెడ్డి, నాయకులు పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ని గెలిపించాలని ఓటర్లను కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వల్లే సుపరిపాలన సాధ్యం అని ప్రజల్లో విశ్వాసం పెరిగిందని అందువల్లే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని గుర్తు చేశారు. అదేవిధంగా ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 

2fae3d34-87a3-4807-8b6f-a19bffcb9781

Read More నవ వధువుకు పుస్తెమెట్టెలు అందజేతా..

ఈ కార్యక్రమంలో 4 వ వార్డు కౌన్సిలర్ యస్ మధుసూధన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మినారాయణ, మాజీ ఉప సర్పంచ్ శంకర్ గౌడ్, తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు యాదగిరి, మురళి గౌడ్, మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి మురళి గౌడ్, కోశాధికారి నర్సింహ్మ రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ అనుబంధ సంఘాలు ఓబీసీ సెల్, మైనార్టీ సెల్, మహిళ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మీనారాయణ, జాఫర్, నాగమణి, జగదీష్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ రామచంద్ర యాదవ్, అధికార ప్రతినిధి మల్లేష్ యాదవ్, ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శి దర్శన్ గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శేశాంత్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బాల్ రాజు, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రమేష్, వార్డుల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాబు, మహేష్,బిక్షపతి, కాంగ్రెస్ నాయకులు ప్రదీప్,వేణుగోపాల్ రెడ్డి, బాబు, రాము, మల్లేష్ గౌడ్, నర్సింగ్ యాదవ్, యాదగిరి, దయానంద యూత్ కాంగ్రెస్ నాయకులు హేమంత్ సాగర్ యాదవ్, భాను, మధురెడ్డి, రాజేష్, సాయిరాం, జేశ్వంత్, హర్షరెడ్డి, బాల్ కృష్ణ,సంతోష్, శంకర్, శేఖర్, సంతు, శ్రీను, మురళి, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Read More ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుక్స్,పెన్నులు పంపిణీ