ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని క‌లిసిన పీర్జాదిగూడ మేయ‌ర్ అమ‌ర్ సింగ్‌

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని క‌లిసిన పీర్జాదిగూడ మేయ‌ర్ అమ‌ర్ సింగ్‌

జయభేరి, మేడిపల్లి : పీర్జాదిగూడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని మేయ‌ర్ అమ‌ర్ సింగ్ కోరారు. బుధవారం మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ తోట‌కూర వ‌జ్రేశ్ యాద‌వ్, మేడ్చ‌ల్ మాజీ ఎమ్మెల్యే మ‌లిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీసీ అధ్య‌క్షులు సింగిరెడ్డి హ‌రివ‌ర్ధ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని మేయ‌ర్ అమ‌ర్ సింగ్ క‌లిశారు. మేయ‌ర్‌గా నూత‌నంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత అమ‌ర్ సింగ్ ముఖ్య‌మంత్రిని మొద‌టిసారి క‌లిశారు.

ఈ సంద‌ర్భంగా పీర్జాదిగూడలో చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌నుల‌కు, ఎస్ఎన్‌డీపీ ప‌నుల కోసం నిధులు మంజూరు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. బోడుప్ప‌ల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయ‌ర్ తోటకూర అజ‌య్ యాద‌వ్, మేడ్చల్ మున్సిపాలిటీ చైర్మన్ దీపిక నర్సింహారెడ్డి, బోడుప్పల్ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ సైతం ముఖ్య‌మంత్రిని క‌లిసిన వారిలో ఉన్నారు.

Read More వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది

Latest News

BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!! BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!!
జయభేరి, హైదరాబాద్‌, జూన్‌ 18 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ఇంతవరకు జరిగిన కృషిని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ను...
కాళేశ్వరం ప్రాజెక్టును కాలగర్భంలో కలిపి, కేసీఆర్‌ ని వ్యక్తిగతంగా బద్నాం చేయాలనే కాంగ్రెస్ కుట్రలు
KavyaKalyanram : అందమే అసూయపడేలా కనువిందు
Air India Flight Crashed : అంతులేని విషాదం వెనుక
Pooja Hegde
Deepika pilli