బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో నెగ్గిన అవిశ్వాసం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు అభివృద్ధి కోసం పక్క ప్రణాళికలతో ముందుకు సాగుతుందని అన్నారు. తమ మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ తోటకూర అజయ్ యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో నెగ్గిన అవిశ్వాసం

జయభేరి, మేడిపల్లి : 
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో శనివారం మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి గౌడ్ ల పై కీసర అర్డివో వెంకట ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కౌన్సిల్ సమావేశంలో మొత్తం 28 మంది సభ్యులకు 22 మంది మద్దతు ఇచ్చారు.

ఈ సందర్భంగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ లు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు అభివృద్ధి కోసం పక్క ప్రణాళికలతో ముందుకు సాగుతుందని అన్నారు. తమ మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ తోటకూర అజయ్ యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. డిప్యూటీ మేయర్ పేరు త్వరలోనే ప్రకటిస్తామన్నారు..

Read More Telangana I మును గో.. డౌట్..

Views: 0