MMTS : 2 రోజులు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
ఈనెల 25, 26 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు, 4 డెమూ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు రైల్వే సంస్థ ప్రకటించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీల (FOB)ల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్-ఫలక్‌నుమా, మేడ్చల్-సికింద్రాబాద్, లింగంపల్లి-మేడ్చల్, హైదరాబాద్-మేడ్చల్ మధ్య ప్రయాణికులకు నిత్యం సేవలందించే 22 ఎంఎంటీఎస్ సర్వీసులను క్యాన్సిల్ చేస్తున్నట్లు చీఫ్ పీఆర్వో సీహెచ్.రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు.
జయభేరి, హైదరాబాద్, మే 25
జంట నగరాల్లో నివసిస్తున్న వారికి మెట్రో కన్నా ముందు నుంచి ఎంఎంటీఎస్ మెరుగైన సేవలు అందిస్తూ వస్తోంది.
ఈనెల 25, 26 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు, 4 డెమూ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు రైల్వే సంస్థ ప్రకటించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీల (FOB)ల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్-ఫలక్‌నుమా, మేడ్చల్-సికింద్రాబాద్, లింగంపల్లి-మేడ్చల్, హైదరాబాద్-మేడ్చల్ మధ్య ప్రయాణికులకు నిత్యం సేవలందించే 22 ఎంఎంటీఎస్ సర్వీసులను క్యాన్సిల్ చేస్తున్నట్లు చీఫ్ పీఆర్వో సీహెచ్.రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు సిద్దిపేట-సికింద్రాబాద్ మధ్య సర్వీసులను అందించే నాలుగు డెమూ రైళ్ల రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని రైళ్లను రెండు రోజుల పాటు, మరికొన్ని రైళ్లను ఒక్కరోజు పాటు సర్వీసులు క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు.


