Manne Krishank I ఈ ఫోటో తప్పు అని నిరూపించగలరా?
సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సవాల్ విసిరారు...
జయభేరి, హైదరాబాద్:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ సవాల్ విసిరారు. చిత్రపురి సొసైటీలో రూ. 3 వేల కోట్ల భూకబ్జాకు పాల్పడిన అనుముల మహానంద రెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని రేవంత్ రెడ్డి నిరూపించగలడా..? క్రిశాంక్ సవాల్ విసిరారు. ఈ భూకబ్జా పోస్ట్ చేసినందుకు మన్నె క్రిశాంక్‌పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు. చిత్రపురి సొసైటీలో రూ. 3 వేల కోట్ల భూములిచ్చిన అనుముల మహానంద రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి బంధుత్వం ఉందని ఆధారాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి కోర్టుకు వచ్చి ఇది తప్పని నిరూపించగలరా? అంటూ సవాల్ విసిరారు. అతనెవరో మాకు తెలియదని.. తామెప్పుడూ చూడలేదని వాదిస్తున్నారు. వాడు తెలియకపోతే, చూడకపోతే ఈ ఫోటోలు ఎలా వస్తాయి..? రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తూ.. కోర్టుకు రండి.. ఈ ఫోటో తప్పని నిరూపిస్తారా..? సుప్రీంకోర్టు, హైకోర్టు.. ఏ కోర్టుకైనా వెళ్దాం అని క్రిశాంక్ సూచించారు.
Post Comment