శంబీపూర్ రాజును కలిసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

జిల్లాతో పాటు  మేడ్చల్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల గురించి మేడ్చల్ నాయకులను శంబీపూర్ రాజు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీని స్వార్ధపరులు ఎవరు వీడినా నిజమైన నాయకులు మాత్రం బిఆర్ఎస్ ను వీడరని చెప్పారన్నారు. పార్టీని ఎఴరు వీడినా నాయకులు, కార్యకర్తలు అధైర్య పడవద్దని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలిసేలా చేయాలని సూచించారని తెలిపారు.

శంబీపూర్ రాజును కలిసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

మేడ్చల్..
మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును మేడ్చల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

శంబీపూర్ లోని తన క్యాంప్ ఆఫీస్ లో మేడ్చల్ నాయకులు శంబీపూర్ రాజును కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా మేడ్చల్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ... జిల్లాతో పాటు  మేడ్చల్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల గురించి మేడ్చల్ నాయకులను శంబీపూర్ రాజు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీని స్వార్ధపరులు ఎవరు వీడినా నిజమైన నాయకులు మాత్రం బిఆర్ఎస్ ను వీడరని చెప్పారన్నారు. పార్టీని ఎఴరు వీడినా నాయకులు, కార్యకర్తలు అధైర్య పడవద్దని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలిసేలా చేయాలని సూచించారని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ మున్ముందు మంచిరోజులు వస్తాయని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Read More Telangana I కంచర గాడిద.. రేసుగుర్రం... సన్నాసి! దద్దమ్మలు! దున్నపోతును కొనుక్కున్నది ఎవరు?

Views: 0