హోరాహోరీగా సాగిన లడ్డు వేలం పాట

లడ్డూ దక్కించుకున్న ఆకుల శంకర్

సాయిరాం యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు

హోరాహోరీగా సాగిన లడ్డు వేలం పాట

జయభేరి, సెప్టెంబర్ 16:- మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం అలియాబాద్ గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద శ్రీ సాయిరాం యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా మండపం వద్ద లడ్డు వేలం పాట నిర్వహించారు. హోరాహోరీగా ఈ వేలం పాట కొనసాగగా చివరకు 201000 వేల రూపాయలకు గ్రామానికి చెందిన ఆకుల శంకర్ కైవసం చేసుకున్నారు. వేలం పాటలో గణేష్ లడ్డు ను దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా శంకర్ తెలిపారు. వినాయకుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని ఆయన కోరారు.

Read More రేవంత్ రెడ్డి కి ఓటు వేసి తప్పు చేశాం అంటున్న ప్రజలు....