సేవారత్న జాతీయ అవార్డు అందుకున్న RTI రాష్ట్ర అధ్యక్షులు కొర్ర కిషన్ నాయక్

సేవారత్న జాతీయ అవార్డు అందుకున్న RTI రాష్ట్ర అధ్యక్షులు కొర్ర కిషన్ నాయక్

జయభేరి, దేవరకొండ : 
సేవారత్న నేషనల్ అవార్డు 2024 సంవత్సరమునకుగాను కొర్ర కిషన్ నాయక్ అందుకున్నారు. సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన బహుజన సాహిత్య అకాడమీ 7వ తెలంగాణ రాష్ట్ర కన్ఫరెన్స్ లో బహుజన సాహిత్య అకాడమీ (BSA) జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ చేతులమీదుగా అవార్డు అందుకున్నాను.

ఈ సందర్భంగా నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ... ఎస్.సి  ఎస్.టీ బి.సి. &మైనారిటీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ దేశంలోనీ 27 రాష్ట్రాలలో, ప్రపంచంలో నీ 8దేశాలలో పనిచేస్తూ ఉన్నది. అకాడమీ వారు ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు, సంఘాసేవకులకు, కవులకు, రచయితలకు, స్వచ్చందంగా సంస్థలకు ఈ అవార్డును అందజేస్తున్నట్లు తెలియజేశారు. తెలంగాణ లోని 33 జిల్లాల నుండి సుమారుగా 200 మంది డెలిగేట్స్ ఈ కన్ఫరెన్స్ కి హాజరైనరాని తెలియజేశారు. అవార్డు అందజేసిన వారితో పాటుగా.BSA జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ,దరువు ఎల్లన్న ,తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యం. యం. గౌతమ్, రాష్ట్ర కమిటీ సభ్యులు డా.. చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మరియు తుదితరులు పాల్గొన్నారు.

Read More Telangan I ఏదీ రాజ్యాంగ స్ఫూర్తి.. సందేహమా? సవాళ్ల?

Views: 0