ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ వారి కుటుంబ సభ్యులతో కలిసి ఓటును వినియోగించుకున్నారు 

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి

జయభేరి, ఖమ్మం :
సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, టీజేఎస్ బలపరిచిన ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రామసహయం రఘురాం రెడ్డిని రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ తో గెలిపించేందుకు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు కృషి చేయాలని  ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాల దుర్గ ప్రసాద్ కోరారు.

పది సంవత్సరాలు దేశాన్ని పాలించిన బీజేపీ తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశ ప్రజల కష్టాలు తీరుతాయని ఆయన తెలిపారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు BRS పార్టీకి బుద్ది చెప్పారని ఈ ఎన్నికల్లో బీజేపీని కూడా ఇంటికి సాగనంపుతారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే కొన్ని నెరవేర్చిందన్నారు. ఆగస్టు లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం...

Read More Telangana I చెత్త మనుషులు

Views: 0

Related Posts