రికార్డు బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్న ఖైరతాబాద్ గణేష్..

ఈసారి స్పెషాలిటీ ఎంటంటే..?

''ఖైరతాబాద్లో పర్యావరణహిత విగ్రహం ఏర్పాటు చేస్తాం. సంప్రదాయం ప్రకారం కర్రపూజ చేసి విగ్రహం ఏర్పాటు ప్రారంభించాం. గతంలో కంటే మెరుగ్గా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.

రికార్డు బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్న ఖైరతాబాద్ గణేష్..

జయభేరి, హైదరాబాద్: 
ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు కర్రపూజ నిర్వహించారు. ఈసారి 70 అడుగుల వినాయకుడి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.

కర్రపూజ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ''ఖైరతాబాద్లో పర్యావరణహిత విగ్రహం ఏర్పాటు చేస్తాం. సంప్రదాయం ప్రకారం కర్రపూజ చేసి విగ్రహం ఏర్పాటు ప్రారంభించాం. గతంలో కంటే మెరుగ్గా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు అన్ని విభాగాలను సమాయత్తం చేస్తున్నాం. రాబోయే రెండుమూడు రోజుల్లో ఉత్సవ కమిటీలతో సమావేశమై చర్చిస్తాం.

Read More ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుక్స్,పెన్నులు పంపిణీ