KCR : కేసీఆర్ బ‌స్సు యాత్ర‌.. ఏప్రిల్ 22 నుంచి మే 10 వ‌ర‌కు

యాత్రకు పోలీసుల సహకారం అందేలా చూడాలని కోరారు.

  • ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ బస్సుయాత్ర చేయనున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ బస్సు ప్రయాణ అనుమతి విషయమై బీఆర్‌ఎస్ నాయకులు కె.వాసుదేవ రెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌ను కలిశారు.

KCR : కేసీఆర్ బ‌స్సు యాత్ర‌.. ఏప్రిల్ 22 నుంచి మే 10 వ‌ర‌కు

జయభేరి, హైదరాబాద్:
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ బస్సుయాత్ర చేయనున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ బస్సు ప్రయాణ అనుమతి విషయమై బీఆర్‌ఎస్ నాయకులు కె.వాసుదేవ రెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌ను కలిశారు. ఈ మేరకు వాసుదేవ రెడ్డి బస్సు యాత్ర వివరాలను వికాస్ రాజ్ కు అందజేశారు. ఈ నేపథ్యంలో యాత్రకు సంబంధించి భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. యాత్రకు పోలీసుల సహకారం అందేలా చూడాలని కోరారు. ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలని వాసుదేవరెడ్డి కోరారు.

నిన్నటి బీఆర్‌ఎస్‌ సమావేశంలో ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని 3-4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు ఉంటాయని, నేతలు కూర్చొని పార్టీకి అనుకూలమైన రూట్‌మ్యాప్‌, స్థానాలను నిర్ణయించుకోవాలని కేసీఆర్‌ సూచించారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మళ్లీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రోడ్‌షోలు ఉంటాయని తెలిపారు. బస్సు యాత్రలు చేస్తూనే బహిరంగ సభల్లో కూడా పాల్గొంటానని చెప్పారు. సిద్దిపేట, వరంగల్ సహా ఇతర ప్రాంతాల్లో కొన్ని బహిరంగ సభలు ఉంటాయన్నారు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని కోరారు.

Read More మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత