Kamareddy | జర్నలిస్ట్ ను బెదిరించిన ఎస్సైని వెంటనే విధుల నుండి తొలగించాలి

టీడీడబ్ల్యూజేఎఫ్

Kamareddy | జర్నలిస్ట్ ను బెదిరించిన ఎస్సైని వెంటనే విధుల నుండి తొలగించాలి

జయభేరి, కామారెడ్డి జిల్లా :

తెలంగాణ డిజిటల్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సాతర్ల మహేష్ ఆదేశానుసారం ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో టీడీడబ్లూజేఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లేడ నరేష్ కుమార్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో వర్కింగ్ లో ఉన్న దళిత జర్నలిస్ట్ ను బాధ్యత గల ఒక ఎస్సై ఫోన్ చేసి ఇష్టానుసారంగా నానా బూతులు తిడుతూ, తుపాకీతో కాల్చి పారేస్తా అని బెదిరిండాన్ని తెలంగాణ డిజిటల్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

Read More మల్లారెడ్డి ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి

విషయానికొస్తే ఆర్మూర్ లో అక్రమ భవన నిర్మాణం చేపడుతున్న ఓ వ్యక్తిని జర్నలిస్ట్ పురుషోత్తం మరియు మరో ఇద్దరు జర్నలిస్టులు సమాచారం నిమిత్తం అడగగా అతని మామ అయినటువంటి జగిత్యాల జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై రవీందర్ శెట్టి జోక్యం చేసుకుని జర్నలిస్ట్ పురుషోత్తంకు ఫోన్ చేసి తీవ్రంగా బెదిరించాడు. మీరు జర్నలిస్టులు అయితే ఏందీరా 100 మందిని తీసుకొచ్చి మిమ్మల్ని చంపేస్తా అంటూ తీవ్ర స్థాయిలో బెదిరించాడు.ఆ విషయం పై శుక్రవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర కమిటీ పాల్గొని దళిత జర్నలిస్టుల ను నానా రకాలుగా తిడుతూ, చంపేస్తా అంటూ బెదిరించినా ఎస్సై రవీందర్ శెట్టిని వెంటనే విధుల నుండి తొలగించి, అతని పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశం పై ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇవ్వకుంటే 10 వేల మంది జర్నలిస్ట్ లతో రాష్ట్రం మొత్తం స్థంభించే విధంగా ధర్నాలు,రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీడబ్లూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లేడ నరేష్ కుమార్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చెట్టి రాజేష్, ప్రధాన కార్యదర్శి అఖిల్, జిల్లా కమిటీ సభ్యులు జగన్, తిరుపతి, నర్సయ్య, కిరణ్, అజయ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read More ఈనెల 25న జరిగే రవీంద్ర భారతిలో బీసీల సమరభేరిని విజయవంతం చేయండి

Latest News

ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి  ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
జయభేరి, దేవరకొండ :రాష్ట్రములో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2(హెచ్) ప్రకారం అధికార యంత్రంగం సూచిక బోర్డులను తప్పనిసరిగా...
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పీఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్థానిక ఆదర్శ పాఠశాల ముందు ధర్నా
వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మొద్దునిద్ర వీడని రేవంత్ సర్కార్ 
ప్రజా ప్రభుత్వంలో విద్యా రంగానికే పెద్ద పీఠ 
విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

Social Links

Post Comment