ఆరోగ్యశ్రీలో అదనంగా 65 కొత్త చికిత్స విధానాలు అమలు

1375 పాత చికిత్స విధానాలకు నగదు ప్యాకేజీ పెంపు

వీటికి గాను 487 కోట్లు విడుదల చేసిన డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్ల

ఆరోగ్యశ్రీలో అదనంగా 65 కొత్త చికిత్స విధానాలు అమలు

జయభేరి, హైదరాబాద్ : 

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద యాంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నుముక వంటి ఖరీదైన వ్యాధులకు చికిత్స, ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ పథకంలోని చికిత్సల ప్యాకేజీ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి రూ.497.29 కోట్లు అవసరం కాగా శనివారం ఈ నిధులను విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి  విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పధకం కింద కొత్త చికిత్సా విధానాల కొరకు, ప్రస్తుతము ఉన్న పథకాల ఆర్థిక సవరణ కొరకు మంత్రి భట్టి విక్రమార్క మల్లుతో జూన్ 7న రాష్ట్ర సచివాలయంలో సమావేశము జరిగింది.

Read More సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం...

అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము 2007 లో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యము అందించేందుకు ఆరోగ్యశ్రీ పధకం ప్రెవేశపెట్టారు. ఈ పథకం కింద 2.84 కోట్ల లబ్ధిదారులు ఉన్నారు. వీరికి 10  లక్షల వరకు ఆర్ధిక సహాయం ఈ పధకం ద్వారా అందుతుంది. రాష్ట్రం లో ఈ సదుపాయము 1402 ఆసుపత్రుల ద్వారా అందించబడుతుంది. 

Read More నిత్యవసర వస్తువులుకు ధరలకు రెక్కలు