Sunitha : మల్కాజిగిరి కి నేను లోకల్ -సునీతా మహేందర్ రెడ్డి
ప్రచారంలో మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి
- తను రంగారెడ్డి జిల్లాకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశానని గత కొన్ని సంవత్సరాలుగా మల్కాజిగిరి ప్రాంత ప్రజలతో పరిచయాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీగా గెలిస్తే మల్కాజిగిరి ని మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు.
జయభేరి, మేడ్చల్ :
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నేను లోకల్ అని మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిదిలోని ఆర్జిత విల్లాస్, అపర్ణ కేనోపి, మైపి ఉల్లాస్, నెబారవుడ్ గేటెడ్ కమ్యూనిటీ కాలనీ వాసులతో సునీతా మహేందర్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల పాలనలో చేసిన అభివృద్ధి పనులు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కాలనీ వాసులకు వివరిస్తూ మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా తనకు మద్దత్తు ఇవ్వాలని సునీతా రెడ్డి కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు చేసిన ఈటల రాజేందర్ తనను నాన్ లోకల్ అనడం విడ్డురంగా ఉందన్నారు. తను రంగారెడ్డి జిల్లాకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశానని గత కొన్ని సంవత్సరాలుగా మల్కాజిగిరి ప్రాంత ప్రజలతో పరిచయాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీగా గెలిస్తే మల్కాజిగిరి ని మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసే వారికి ప్రజలు అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు.


