ఆరోగ్యం బాగుందా రమేష్

ఆప్యాయతతో గండ్ర సత్యనారాయణ రావు పలకరింపు

ఆరోగ్యం బాగుందా రమేష్

ఇటీవల అనారోగ్యం పాలై భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ మొగుళ్ళపల్లి టౌన్  ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్ ను భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు బుధవారం తన ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ఆరోగ్యం బాగుందా రమేష్ అని గండ్ర సత్యనారాయణ రావు పలకరించడంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు గండ్ర సత్యన్న ప్రేమానురాగాలను చూసి తరించిపోయారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తక్కల్లపల్లి రాజు, ఎండి రఫీ, నీరటి మహేందర్ తదితరులున్నారు.

Read More మోటార్ సైకిల్ దొంగలించిన నిందితుడు అరెస్టు