తెలంగాణ సహా ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు....

తెలంగాణ సహా ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు....

దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రాల జాబితాను విడుదల చేసి అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

రానున్న మూడు రోజులు అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే జూలై 16న (మంగళవారం) గుజరాత్‌లో అతి భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. అలాగే వచ్చే మూడు రోజుల్లో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, నాగాలాండ్, కేరళ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Read More తీన్మార్ మల్లన్నకు గిరిజన సంక్షేమ సంఘం మద్దతు

Views: 0