ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి: ఇంట్లో నోట్ల కుప్పలు
కుప్పలు తెప్పలుగా కరెన్సీ నోట్ల కట్టలు బయటకు రావడంతో ఏసీబీ అధికారులు సైతం అవాక్కయ్యారు. అన్వేషణ కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే.. దాసరి నరేందర్ నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు.
జయభేరి, నిజామాబాద్:
రాష్ట్రంలో మరో అవినీతి అధికారి ఉదంతం వెలుగులోకి వచ్చింది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం ఓ అధికారి ఇంట్లో సోదాలు నిర్వహించి పెద్ద మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కుప్పలు తెప్పలుగా కరెన్సీ నోట్ల కట్టలు బయటకు రావడంతో ఏసీబీ అధికారులు సైతం అవాక్కయ్యారు. అన్వేషణ కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే.. దాసరి నరేందర్ నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు.
ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో దాసరి నరేందర్ వద్ద ఉన్న మొత్తం ఆస్తులు రూ. 7 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన నరేందర్‌పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఏసీబీ అధికారుల సోదాల్లో కోట్లాది రూపాయలు దొరకడం ఇప్పుడు మిస్టరీగా మారింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


