Good News : అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ..!!

Good News : అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ..!!

రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.అక్టోబర్ లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్, హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. సెప్టెంబర్ 16న కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది. అనంతరం మంత్రి ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించారు.

కొత్త రేషన్ కార్డు విధివిధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు మంత్రి ఉత్తమ్. తెల్ల రేషన్ కార్డు అర్హులు ఎవరనేదానిపై వచ్చే భేటీలో నిర్ణయిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఎలా ఇస్తున్నారనేదానిపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డుల నిబంధనలు ఎలా ఉండాలని పార్టీలకు లేఖ రాశామన్నారు.. కొంత మంది ప్రజాప్రతినిధులు విలువైన సూచనలు చేశారు. వచ్చిన సూచనలన్నీ సమావేశంలో చర్చించామని తెలిపారు.

Read More BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!!

రాష్ట్రంలో దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు మంత్రి ఉత్తమ్. అందరికి ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామన్నారు. గత ప్రభుత్వం 49 వేల రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చింది..అవి కూడా బై ఎలక్షన్ వచ్చిన నియోజకవర్గాల్లోనే రేషన్ కార్డులు ఇచ్చారు. బీఆర్ఎస్ రాష్ట్రమంతా ఏ నాడు రేషన్ కార్డులు ఇవ్వలేదు . మేం పారదర్శకంగా రేషన్ కార్డులు జారీ చేస్తాం. సెప్టెంబర్ 21 నమరోసారి కేబినెట్ సబ్ కమిటీ భేటీ ఉంటుంది. ఈ నెలాఖరులోగా కేబినెట్ కమిటి రిపోర్ట్ ఇస్తుంది. అక్టోబర్ లో అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు మంత్రులు.

Read More కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి కుంటుపడిన విద్యా వ్యవస్థ

Latest News

BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!! BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!!
జయభేరి, హైదరాబాద్‌, జూన్‌ 18 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ఇంతవరకు జరిగిన కృషిని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ను...
కాళేశ్వరం ప్రాజెక్టును కాలగర్భంలో కలిపి, కేసీఆర్‌ ని వ్యక్తిగతంగా బద్నాం చేయాలనే కాంగ్రెస్ కుట్రలు
KavyaKalyanram : అందమే అసూయపడేలా కనువిందు
Air India Flight Crashed : అంతులేని విషాదం వెనుక
Pooja Hegde
Deepika pilli